Home » Mumbai
బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టు జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వ్ అయింది. అయితే బీఎంసీ లాటరీ ప్రక్రియపై ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
సలేం కేసులో తాము ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ అని సీబీఐ పేర్కొంటూ తమను రెస్పాండెంట్‌గా చేర్చాలని కోరింది. సలేంకు బెయిల్ కానీ, పెరోల్ కానీ ఇస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చని కూడా సీబీఐ స్పష్టం చేసింది..
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ వాహనానికి సోమవారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది. ముంబైలో తన భార్య ట్వింకిల్ ఖన్నాతో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
మహారాష్ట్రలో యాభై ఏళ్ల క్రితం నాటి ఓ చోరీ కేసుకు సంబంధించి కోర్టు తుది తీర్పు వెలువడింది. ఎన్నో ఏళ్లు నిందితుల గురించి పోలీసులు వెతికినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. దీంతో కోర్టు ఈ కేసుకు ముగింపు పలికింది. ఇంతకీ చోరీ అయిన మొత్తం ఎంతో తెలుసా.. 7.65 రూపాయలు.
మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఎన్డీఏ నేతృత్వంలోని అధికార ‘మహాయుతి’ కూటమి గెలుపు దిశగా దూసుకుపోతోంది.
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-శివసేన (షిండే) కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. 130 సీట్లకుపైగా కైవనం చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే తదితరులు మహాయుతి వచన్ నామాను విడుదల చేశారు.
ఠాక్రే సోదరుల మధ్య భిన్న సైద్ధాంతిక విభేదాలున్నా దేశానికి ప్రాధాన్యతనిచ్చి ఐక్యంగా నిలిచారని సంజయ్ రౌత్ అన్నారు. ఠాక్రేలు అంటేనే ఒక బ్రాండ్ అని, ఠాక్రేలు ఉన్నంత కాలం మరాఠా ప్రజలకు రక్షణ ఉంటుందని చెప్పారు.
టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. లిస్ట్-ఏ మ్యాచుల్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా గురువారం పంజాబ్, ముంబై మధ్య జరిగిన మ్యాచులో ఈ ఫీట్ సాధించాడు.
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పంజాబ్ సంచలన విజయం సాధించింది. ముంబై జట్టుపై ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఈ విజయంతో పంజాబ్ గ్రూప్ సి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.