Home » Money
పింఛన్ల పంపిణీలో రాజకీయాన్ని వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన పంపిణీ చేసే వెసులుబాటు ఉన్నా.. బ్యాంకు ఖాతాలలో జమచేస్తామని చెప్పడం లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమేనని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో సొమ్ము జమ అయిందో లేదో తెలుసుకోవడం, బ్యాంకు నుంచి నగదు వితడ్రా చేసుకోవడం దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందికరం. ఎండలు మండిపోతున్న తరుణంగా బ్యాంకులకు వెళ్లడం వారికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. జిల్లా వ్యాప్తంగా 663 గ్రామ, వార్డు సచివాలయాలలో...
ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం ఉంది. భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. గత 24 గంటల్లో రూ.8.65 కోట్ల విలువైన మద్యం, నగదును స్వాధీనం చేసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
సీఎం జగన బటన నొక్కి మూడు నెలలు అవుతున్నా పొదుపు మహిళల ఖాతాల్లోకి వైఎస్సార్ ఆసరా సొమ్ము జమకాలేదు. జిల్లా వ్యాప్తంగా 5,190 మహిళా సంఘాలకు ఇప్పటి వరకూ ఒక్క పైసా అందలేదు. ఇవన్నీ ఓసీ, బీసీ సామాజికవర్గ మహిళల గ్రూపులేనని సమాచారం. జిల్లా వ్యాప్తంగా వీరికి రూ.41.36 కోట్లు రావాల్సి ఉంది. డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియని దిక్కు తెలియని స్థితిలో మహిళలు ఉన్నారు.
లోక్ సభ ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టుకునే పనిలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబడింది. నగదుతోపాటు, బంగారం, వెండి, గంజాయిని కూడా పోలీసులు సీజ్ చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం పతాకస్థాయికి చేరింది. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునే పనిలో నేతలు ఉన్నారు. ఓటుకు ఎంతయినా ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. ఎన్నికల్లో గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు.
లోక్ సభ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా పట్టుబడింది. మూడు ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో రూ.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో జొమాటో డెలివరీ బాయ్ నగదు రవాణా చేయడం తీవ్ర కలకలం రేపింది. నగదు పట్టివేతకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే ప్రలోభాల పర్వానికి తెరలేచింది. మద్యం, నగదు, కానుకలను తరలిస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో భారీగా నగదు పట్టుబడింది. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు రూ.140 కోట్ల విలువ గల నగదు, మద్యం, కానుకలు పట్టుబడ్డాయని ఎన్నికల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
భాగ్యనగరంలో(Hyderabad) భారీ స్కామ్ వెలుగు చూసింది. నిరుద్యోగుల అవసరాలనే ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేసుకున్నారు కేటుగాళ్లు. పార్ట్ టైం ఉద్యోగాల(Part Time Jobs) పేరుతో భారీ మోసానికి తెరలేపారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 524 కోట్లు దోచేశారు కేటుగాళ్లు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు..
అనుమానాస్పద లావాదేవీలతో వేల కోట్ల రూపాయలు దేశం దాటించిన కేసులో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈడీ) అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు
ప్రస్తుత కాలంలో చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్స్(Investments) వైపు దృష్టి సారిస్తున్నారు. ఉన్న కొంత మొత్తమైనా పెట్టుబడి పెట్టడం ద్వారా రాబడి పొందాలని భావిస్తుంటారు. తక్కువ పెట్టుబడిపై మంచి వడ్డీని అందించే పథకాల(Investment Schemes) కోసం వెతుకుతుంటారు. అలాంటి పెట్టుబడి స్కీమ్స్‌ని మీకోసం తీసుకువచ్చాం. పోస్ట్ ఆఫీస్‌కు(Post Office) చెందిన ఈ 5 పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా..