Home » Mohammad Shami
Shami Wife Hasin Jahan: వన్డే ప్రపంచకప్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న మహ్మద్ షమీ(Mohammad Shami) పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆలస్యంగా జట్టులోకి వచ్చినా ప్రత్యర్థులను అతడు తన బౌలింగ్‌తో బెంబేలెత్తిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. అంతేకాకుండా నాలుగు మ్యాచ్‌లలో కేవలం 7 సగటుతో 16 వికెట్లు సాధించి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడి మాజీ భార్య ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ముంబైలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్ హిస్టరీలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ఆదివారం ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌పై చెలరేగిన స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీ.. మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో ఎందుకు పక్కన పెట్టారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా రాణించాడు. పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న కివీస్‌ను 273 పరుగులకే కట్టడి చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఈ వరల్డ్ కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లు తీసి శెభాష్ అనిపించుకున్నాడు.
మహ్మద్ షమి.. తానేంటో మరోసారి నిరూపించాడు. వరల్డ్ కప్‌లో పలు మ్యాచ్‌లకు ‘బెంచ్’కే పరిమితమైనా బాధపడలేదు. దొరికిన అవకాశాన్ని వినియోగించుకొని కివీస్ వెన్నువిరిచాడు. ఆ జట్టు భారీ స్కోరు చేయకుండా...