Home » MLC Elections
ఎన్నికలలో వైసీపీ ఎప్పటికప్పుడు మాట మారుస్తూ వచ్చిందని, చివరకు పీడీఎఫ్ అభ్యర్దికి వైసీపీ మద్దతు ఇచ్చిందని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు. వైసీపీ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోలేదని.. ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. 483 బూత్‌లలో ఒక్క బూత్‌లో కూడా పీడీఎఫ్ అభ్యర్థికి మెజారిటీ రాలేదన్నారు.
కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. వైసీపీ మద్దతు తెలిపిన పీడీఎఫ్ అభ్యర్థులు ఘోర పరాజయం చవిచూశారు.
కృష్ణా-గుంటూరు స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా అనూహ్య మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్ధిపై 82, 319 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 41 వేలు 544... చెల్లని ఓట్లు 26, 676.. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 1,45, 057 ఓట్లు రాగా.. ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి.
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ముందంజలో ఉన్నారు.
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమికే గ్రాడ్యుయేట్లు జై కొట్టారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు విజయం సాధించారు.
AP MLC Eletions: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ఘన విజయం సాధించారు. ఇక కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు. పలు రౌండ్లలో ఆయన స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోన్నారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
అమరావతి: ఏపీలో ఐదు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల అయింది. నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఇప్పటికే షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
MLC Elections Vote Counting: తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇవాళ(సోమవారం) గుంటూరు - కృష్ణ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభమైంది.