Home » MLC Elections
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. 81 కార్పొరేటర్లు, 31 ఎక్స్ అఫిషియో సభ్యుల కోసం జీహెచ్ఎంసీ ఆఫీసులో పోలింగ్ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మంగళవారం జరగనుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు.
Local Body MLC Election: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నిక జరుగనుంది.
రేపు జరిగే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని తెలుస్తో్ది. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీలో లేవు. దీంతో పోటీ బీజేపీ, మజ్లిస్ మధ్యే పోటీ ఉంది. అయితే సంఖ్యా బలంగా మజ్లిస్‌కే అవకాశాలున్నా.. బీజేపీ కూడా తమ అభ్యర్థిని రంగంలోకి దించింది.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరగనుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ మద్దతు ఎవరికి అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో కొద్దిరోజుల క్రితం జరిగిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్, ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించిన వారు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
పట్టభద్రులు, టీచర్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటీవల ఎన్నికైన అభ్యర్థులు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 23న ఈ ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు సభ్యులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్; సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం; బీఆర్‌ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన ఎమ్మెల్యీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు చివరికి ఏకగ్రీవం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన 10 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. అభ్యర్థులంతా ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.