• Home » Medigadda Barrage

Medigadda Barrage

Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీ అధికారుల్లో గుబులు

Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీ అధికారుల్లో గుబులు

కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారుల్లో కలవరం మొదలైంది. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బాధ్యులపై, పనులు పూర్తికాకముందే సర్టిఫికెట్‌ జారీ చేసిన ఇంజనీరింగ్‌ అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నతాధికారులను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని సీఎం సీరియ్‌సగా తీసుకొని కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారని, తమపై వేటు కూడా వేసి అవకాశముందని ఇంజనీరింగ్‌ అధికారుల్లో టెన్షన్‌ మొదలైంది.

Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మత్తులపై ఇవాళ రేవంత్ సమీక్ష

Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మత్తులపై ఇవాళ రేవంత్ సమీక్ష

లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టులపై దృష్టి సారించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజిల మరమత్తులపై ఫోకస్ పెట్టింది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజిల మరమత్తులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

CM Revanth Reddy: మేడిగడ్డ రిపేర్లపై నేడు సీఎం నిర్ణయం!

CM Revanth Reddy: మేడిగడ్డ రిపేర్లపై నేడు సీఎం నిర్ణయం!

వానాకాలం లోపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాలనే జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) మధ్యంతర నివేదికపై శనివారం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర జల వనరులసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ మూడు బ్యారేజీలకు వర్షాకాలం ప్రారంభానికి ముందు అత్యవసరంగా చేపట్టాల్సిన తాత్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనాలను సిఫారసు చేస్తూ గతంలో నివేదిక అందించింది.

Hyderabad: మేడిగడ్డకు రిపేర్లు చేయండి..

Hyderabad: మేడిగడ్డకు రిపేర్లు చేయండి..

జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికకు లోబడి మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయాలని ఎల్‌ అండ్‌ టీని నీటిపారుదల శాఖ కోరింది. ఈ మేరకు నిర్మాణ సంస్థకు రామగుండం చీఫ్‌ ఇంజనీర్‌ లేఖ రాశారు. మేడిగడ్డకు తదుపరి మరమ్మతులు చేయాలంటే కాంపోనెంట్ల వారీగా కొత్తగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ మేరకు చెల్లింపులూ చేయాల్సి ఉంటుందని ఎల్‌ అండ్‌ టీ ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Medigadda Barrage: బ్యారేజీలను కాపాడుకోండి!

Medigadda Barrage: బ్యారేజీలను కాపాడుకోండి!

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రక్షణకు చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ సూచించారు.

NDSA: వానాకాలంలోపు మరమ్మతు డౌటే!

NDSA: వానాకాలంలోపు మరమ్మతు డౌటే!

మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు అత్యవసరమని జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) పేర్కొంది. బ్యారేజీ మరింత దెబ్బతినకుండా ఉండేందుకు వానాకాలంలోపు మరమ్మతులు చేయాలని సూచించింది.

Kaleshwaram: ఆ ప్రాజెక్టు కోసం కేసీఆర్‌ని విచారిస్తాం.. జస్టిస్ చంద్ర ఘోష్ కీలక వ్యాఖ్యలు

Kaleshwaram: ఆ ప్రాజెక్టు కోసం కేసీఆర్‌ని విచారిస్తాం.. జస్టిస్ చంద్ర ఘోష్ కీలక వ్యాఖ్యలు

కాళేశ్వరం (Kaleshwaram) బ్యారేజీల అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం తదితర విషయాలపై విచారించడానికి జస్టిస్ చంద్ర గోష్ (Justice Chandra Ghosh) కమిషన్‌‌ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన విషయం తెలిసిందే. నేటి(గురువారం) నుంచి జస్టిస్ చంద్ర ఘోష్ విచారణను ప్రారంభించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలను దృష్టిలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Minister Uttam: జస్టిస్ చంద్ర ఘోష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఉత్తమ్

Minister Uttam: జస్టిస్ చంద్ర ఘోష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఉత్తమ్

Telangana: జస్టిస్ చంద్ర గోష్ కమిషన్‌తో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. నేటి నుంచి బ్యారేజీలపై కమిషన్ విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటిరోజు కావడంతో కమిషన్‌ను మంత్రి ఉత్తమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్ర గోష్ కమిషన్‌కు కాళేశ్వరం అంశాలను వివరించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను మంత్రి విజ్ఞప్తి చేశారు.

Kaleswaram Project: మేడిగడ్డ దిగువభాగంలోనూ పరీక్షలు..

Kaleswaram Project: మేడిగడ్డ దిగువభాగంలోనూ పరీక్షలు..

కాళేశ్వరం ప్రాజెక్టులోని(Kaleswar Project) మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగుబాటుకు గల కారణాలను అన్వేషిండానికి వీలుగా బ్యారేజీ దిగువ భాగంలోనూ సాంకేతిక పరీక్షలు(Technical Tests) నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బ్యారేజీల్లోని అన్ని బ్లాకుల్లో..

Minister Ponnam: మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్

Minister Ponnam: మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్

కరీంనగర్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డలో రెండే పిల్లర్లు కుంగాయాని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి