• Home » Mancherial district

Mancherial district

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా గమ్యస్ధానాలకు చేరుకోవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురు వారం కలెక్టరేట్‌లో జిల్లా రవాణా శాఖ అధికారి సంతోష్‌కుమార్‌తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల సంబంధిత గోడ ప్రతులను విడుదల చేశారు.

తుది ఓటరు జాబితా ప్రచురణకు సిద్ధం

తుది ఓటరు జాబితా ప్రచురణకు సిద్ధం

ఓటరు జాబితా సవరణలో భాగంగా చేపట్టిన ప్రక్రియ పూర్తి చేసుకుని తుది ఓటరు జాబితా ప్రచురణకు సిద్ధం చేశామని పరిశీలకులు సురేంద్ర మోహన్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ సమావేశ మం దిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్దశుక్లాతో కలిసి సమావేశం నిర్వహించారు.

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

కాల చక్రంలో మరో ఏడాది కనుమరుగైంది. గత యేడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం నుంచే విందులు, సంబరాలు ప్రారంభమయ్యాయి. మద్యం, మాంసం, కేక్‌లు, కూల్‌ కేక్‌లు, రంగవల్లుల, కూల్‌డ్రింక్‌లు, రకరకాల రంగులు విక్రయాలు జోరుగా సాగాయి. ఆయా కూడళ్ళ దగ్గర, స్వీట్‌ హౌజ్‌, ఇతర దుకాణాల వద్ద కేక్‌లు విక్రయించారు. నూతన సంవత్సరం 2025కు స్వాగతం పలుకుతూ మంగళవారం రాత్రి 12 గంటలకు సంబరాలు అంబరాన్నంటాయి.

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినచర్యలు

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినచర్యలు

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకొంటామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు ఇసుక రీచ్‌ల నుంచి తీయడం జరుగుతుందని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని, చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తామన్నారు.

చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే సహించేది లేదు

చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే సహించేది లేదు

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ హెచ్చరించారు. మంగళవారం మందమర్రి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్‌లు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు.

 న్యూ ఇయర్‌ వేడుకలో విషాదం

న్యూ ఇయర్‌ వేడుకలో విషాదం

నూతన సంవత్సర వేడుకల్లో విషా దం నెలకొంది. స్నేహితులతో కలిసి దావత్‌ చేసుకొని తిరి గి వస్తుండగా బైక్‌ అదుపు తప్పి కాల్వలో పడిన సంఘ టనలో మంగళవారం రాత్రి ఇద్దరు యువకులు మృతి చెందారు. మండల కేంద్రానికి చెందిన మంద రాజు (35), జిల్లాపెల్లి పవన్‌కళ్యాణ్‌(25) లు బైక్‌పై దండేపల్లి శివారులో అటవీ ప్రాంతంలో న్యూ ఇయర్‌ పార్టీ చేసుకున్నారు.

అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానం కాంగ్రెస్‌ కైవసం

అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానం కాంగ్రెస్‌ కైవసం

ఏడాది కాలంలో పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. 2023 డిసెంబరు 3న వెలువడ్డ ఎన్నికల ఫలితాలు జిల్లా రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీశాయి. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్‌ పార్టీ హస్తగతం చేసుకుంది. మూడు నియోజక వర్గాల్లో దశాబ్దంపాటు పాలన సాగించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.

సీఎం కప్‌ హ్యాండ్‌బాల్‌లో బంగారు పతకం

సీఎం కప్‌ హ్యాండ్‌బాల్‌లో బంగారు పతకం

సీఎం కప్‌ రాష్ట్రస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్‌ హ్యాండ్‌ బాల్‌ జిల్లా జట్టుకు సోమవారం మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 27 నుంచి 29 వరకు హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించారు.

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల నిరసన

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల నిరసన

సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగు లు చేపట్టిన సమ్మె సోమవారం 21వ రోజుకు చేరుకుంది. బుర్రకథను చెబు తూ ఉద్యోగులు విసూత్న నిరసన వ్యక్తం చేశారు. తాము చేస్తున్న విద్యా విధానంలో సేవా కార్యక్రమాలు, అదే విధంగా తాము ఎదుర్కొంటున్న సమ స్యలను వివరిస్తూ బుర్ర కథ రూపంలో వివరించారు.

అమిత్‌షా దిష్టిబొమ్మ దహనం

అమిత్‌షా దిష్టిబొమ్మ దహనం

అంబేద్కర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఐబీ చౌరస్తా లో సోమవారం వామపక్ష పార్టీల నాయకులు అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి