• Home » Mancherial district

Mancherial district

Share Market Loss: ట్రేడింగ్‌లో రూ.30 లక్షల నష్టం కుటుంబం ఆత్మహత్య

Share Market Loss: ట్రేడింగ్‌లో రూ.30 లక్షల నష్టం కుటుంబం ఆత్మహత్య

షేర్‌ మార్కెట్లో నష్టాలు ఓ కుటుంబాన్ని బలిగొన్నాయి. ట్రేడింగ్‌లో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చనే ఉద్దేశంతో అప్పుతెచ్చి, పెట్టుబడులు పెడితే.. అనుభవరాహిత్యం కాటేసింది..! రూ.30 లక్షలు ఆవిరైపోయాయి.

రేషన్‌ డీలర్ల సమస్యలు తీరేదేన్నడు...?

రేషన్‌ డీలర్ల సమస్యలు తీరేదేన్నడు...?

రేషన్‌ డీలర్లు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. పాలకులకు ఏళ్ల తరబడి మొర పెట్టుకుంటున్నా మోక్షం లభించడం లేదు. నెల రోజులు శ్రమ పడితే చివరకు మిగిలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సమస్యలు తీరుతాయని గంపెడు ఆశలు పెట్టుకున్న డీలర్లకు నిరాశే ఎదురైంది.

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

అకాల వర్షాలతో తడిసిన ధాన్యం, పత్తికి మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. నెన్నెల రైతులతో సోమవారం మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ మాట్లాడారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని, పత్తిని పరిశీలించారు.

కలెక్టరేట్‌ ఎదుట ముగిసిన ఎస్‌ఎస్‌ఏల దీక్ష

కలెక్టరేట్‌ ఎదుట ముగిసిన ఎస్‌ఎస్‌ఏల దీక్ష

నస్పూర్‌లోని కలెక్టరేట్‌ ఎదుట తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగుల సంఘం (ఎస్‌ఎస్‌ఏ-జెఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష సోమవారం ముగిసింది. ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోవడంతో మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్ళాలని నిర్ణయించారు.

పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమ వారం మున్సిపల్‌ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత మాట్లా డుతూ వార్డులను నిత్యం పరిశుభ్రంగా ఉంచు తూ ప్రజల ఆరోగ్యాలను రక్షించే కార్మికులు ఆరోగ్యంగా ఉండేందుకు ఎమ్మెల్యే వినోద్‌ ఆదే శాల మేరకు వైద్యపరీక్షలు చేయించినట్లు తెలిపారు.

నిరుద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం

నిరుద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం

కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం యువ మోర్చా ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పాల్గొన్నారు. ర్యాలీని కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ‘మహాలక్ష్మి’తో పెరిగిన రద్దీ

‘మహాలక్ష్మి’తో పెరిగిన రద్దీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంతో మంచిర్యాల డిపో పరిధిలో రద్దీ పెరిగింది. డిసెంబరు 9, 2023న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలులోకి తీసుకువచ్చింది. నాటి నుంచి జీరో టికెట్‌తో మహిళలు ప్రయాణించేలా ఆర్టీసీ అధికారులు వెసలుబాటు కల్పించారు.

చౌక ధరల దుకాణాలకు చేరని బియ్యం

చౌక ధరల దుకాణాలకు చేరని బియ్యం

రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం ఇంతవరకు లబ్ధిదారులకు అందలేదు. ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీ లోపు ఆహార భద్రత కార్డులున్న లబ్ధిదారులకు రేషన్‌ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకు జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ (మండల లెవల్‌ స్టాకిస్ట్‌) పాయింట్ల నుంచి ప్రతీ నెల 25వ తేదీలోపు బియ్యం రేషన్‌ షాపులకు చేరాల్సి ఉంటుంది.

తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం

తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం

తెలంగాణ ఉద్యమం సంద ర్భంగా రూపకల్పన చేసిన తెలంగాణ తల్లి విగ్రహాల రూపురేఖలను మార్చవద్దని నస్పూర్‌ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు క్షీరాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం అం దరూ ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టారన్నారు.

గురుకుల విద్యాలయాలపై సవతి ప్రేమ

గురుకుల విద్యాలయాలపై సవతి ప్రేమ

రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందని బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌ ఆరోపించారు. నస్పూర్‌లోని జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో గురుకుల బాట జిల్లా ఇన్‌చార్జీ చైతన్య, రాష్ట్ర నేత నడిపెల్లి విజిత్‌ కుమార్‌తో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి