Home » Mancherial district
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్క రించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్, పెండింగ్ స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డి మాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదు ట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అభినవ్, బండి సత్య నారాయణ, ద్యాగం శ్రీకాంత్‌లు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయిం బర్స్‌మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణి దేశ పారిశ్రామిక రంగానికి ఇంధన వనరు.. తెలంగాణ రాష్ట్రానికి సిరుల మాగాణి... సింగరేణి... వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మరెన్నో కుటుంబాలకు ఉపాధి కల్పించే కల్పవల్లి. బొగ్గు ఉత్పత్తితోపాటు విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర రైతాంగానికి, పారిశ్రామిక రంగానికి దన్నుగా నిలుస్తోంది... సోమవారం సింగరేణి ఆవిర్భావ వేడుకలను జరుపుకునేందుకు కార్మికలోకం సిద్ధమైంది...
సామాజిక న్యాయం, రాజ్యాధికారం లక్ష్యంతో కొనసాగుతున్న ప్రజారగ్ జోల్ యాత్ర ఆదివారం భీమారం చేరుకుంది. సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబునాయక్, సెంట్రల్ కమిటీ చైర్మన్ ప్రేమ్‌చంద్‌నాయక్, జిల్లా అధ్యక్షుడు గుగులోత్ మల్లేష్ నాయక్ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేశారు.
పోలీసులు క్రీడల్లో రాణించా లని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. ఆదివారం ఎఎంసీ క్రీడా మైదానంలో సబ్ డివిజన్ స్థాయి పోలీసుల క్రికెట్ పోటీలను నిర్వహిం చారు. ఏసీపీ మాట్లాడుతూ రోజు పోలీసులు విధి నిర్వహణలో భాగంగా ఒత్తిడికి గురవుతారని, క్రీడలతో మానసిక ఉల్లాసంతోపాటు శారీరక ధారుడ్యం పెరుగుతుందన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు పేర్కొ న్నారు. ఆదివారం ఇందా రం, ఎల్కంటి, గంగిపెల్లి, జైపూర్ గ్రామాల్లో ఇంది రమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు.
ఇందారం బస్టాండ్ వద్ద శుక్రవారం రాత్రి బైక్ ఢీకొని సుంకరి మల్లయ్య అనే రిటైర్డు కార్మికుడు మృతిచెందగా ఆదివారం ప్రమాదం జరిగిన స్థలాన్ని సీఐ వేణుచందర్ పరిశీలించారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారని కానీ కనెక్షన్ ఇవ్వ కపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.
మంచిర్యాల మున్సిపాలిటీ ఇక కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ కానుంది. ఈ మేరకు ఈ నెల 19న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో మంచిర్యాలను మున్సిపల్ కార్పొరే షన్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని 1, 4, 11, 20 వార్డుల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రావు, చైర్‌పర్సన్ జక్కుల శ్వేతతో కలిసి పరిశీలించారు.
చేతి వృత్తులతో యువతకు ఉపాధి లభిస్తుందని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ చేతివృత్తుల డైరెక్టర్ దివ్యారావు అన్నారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణను పొందుతున్న మహిళలకు నస్పూర్ కాలనీలోని సేవా భవన్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.
మండలంలోని సూపాక గ్రామంలో శుక్రవారం మారమ్మ జాతర ప్రారంభమైంది. మారమ్మ, లక్ష్మీదేవి విగ్రహాలను గ్రామస్థులు పల్లకిలో చెన్నూరు గోదావరి నదికి కాలినడకన చేరు కున్నారు.