Home » Mallikarjun Kharge
మల్లికార్జున ఖర్గే 11 ఏళ్ల మోదీ పాలనను పీడకలగా చెప్పడం సరికాదని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఎమర్జెన్సీని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అది ఓ పీడకల అని విమర్శించారు. ఓబీసీ రిజర్వేషన్‌ను అడుగు అడుగునా అడ్డుకుంది ప్రతిపక్షనేత రాహుల్ గాంధీనే అని లక్ష్మణ్ విమర్శించారు.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను కాల్చిచంపినందుకు ప్రతిగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్‌ను చేపట్టడం ఒక భారతీయురాలిగా గర్వస్తున్నానని సుప్రియా సూలే ప్రశంసించారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పహల్గాం ఉగ్రదాడి గురించి ప్రధానికి ముందే సమాచారం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్‌ను ఆయన చిన్న యుద్ధంగా అభివర్ణిస్తూ, ప్రధాని మోదీ జవాబుదారీ తీరుని విమర్శించారు.
పహల్గాంలో ఉగ్రదాడికి మూడ్రోజుల ముందు ప్రధాని మోదీకి నిఘా సమాచారం అందింది. ఈ కారణంగా జమ్మూ-కశ్మీరు పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు, అని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు.
జార్ఖాండ్‌లోని రాంచీలో మంగళవారంనాడు జరిగిన 'సంవిధాన్ బచావ్' ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వమే స్వయంగా అంగీకరించిందని చెప్పారు.
ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని గత సీడబ్ల్యూసీ సమావేశం స్పష్టం చేసిన విషయాన్ని ఖర్గే గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులైనా కేంద్రం ఇంతరవకూ స్పష్టమైన హ్యూహంతో ముందుకు రాలేదని అన్నారు.
ఉగ్రవాదంపై పోరుకు యావద్దేశం కలిసికట్టుగా పోరాడాలని మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది క్రితం ఇచ్చిన వాగ్దానం ఏమైందని ఖర్గే నిలదీశారు. 2015 ఆగస్టు 15న బీహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని ప్రధాన మంత్రి ప్రకటించారని, ఆ సంగతేమిటని నితీష్ కుమార్‌ను రాష్ట్ర ప్రజలు నిలదీయలని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధినాయకత్వంపై పెద్ద కుట్ర జరుగుతోందని, బీజేపీ అక్రమంగా కేసులు పెడుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీల పేర్లను అక్రమంగా ఛార్జిషీట్లో చేర్చడమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు.
వక్ఫ్ అంశంపై కేంద్రం. బీజేజీ నేతలు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని, వారి కుట్రలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి బహిర్గతం చేస్తుందని ఖర్గే స్పష్టం చేశారు. వక్ఫ్ అంశంపై కాంగ్రెస్, విపక్ష పార్టీలు లేవనెత్తిన కీలకమైన పాయింట్లకు సుప్రీంకోర్టు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.