Home » Mahesh Kumar Goud
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు చేసేటప్పుడు కవిత జైల్లో ఊచలు లెక్కపెడుతోందని విమర్శించారు. కవిత లేఖ రాసింది బీఆర్ఎస్ నాయకురాలిగానా.. జాగృతి నాయకురాలిగానా అని మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) తీసుకున్న జై బాపూ, జై భీమ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎల్బీ స్టేడియంలో టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్రామ కమిటీల అధ్యక్షుల సమ్మేళనం జరగనుంది.
జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించనున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్ తెలిపారు.
Mahesh Kumar Slams Amit: శాంతి భద్రతలు, దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ రాజీపడే ప్రసక్తే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేంద్రంలో ఫాసిస్ట్ మోడీ పాలనకు వ్యతిరేకంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వస్తున్నారని తెలిపారు.
బహుజనులు చదువుకుని నేడు ఉన్నత స్థాయికి చేరుకోవడం వెనుక నాటి జ్యోతిరావు ఫూలే కృషి దాగి ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.
మహాన్యూస్ కార్యాలయంపై జరిగిన దాడిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. మీడియాపై దాడి హేయమైన చర్య అని అన్నారు. మీడియాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50ు పరిమితి మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో ఎప్పుడో దాటిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.
దేశ చరిత్రలోనే ఫోన్ ట్యాపింగ్ అతిపెద్ద నేరమని.. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకెళ్లడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని కాంగ్రెస్ కేడర్‌కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కార్యకర్తలకు పార్టీలో తగిన గౌరవం ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, తాను ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నామని తెలిపారు.