Home » Mahbubnagar
నల్లమల ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మారుస్తామని పర్యాటక శాఖ మంతి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్యే ల బృందంతో నల్లమలలో పర్యటించిన సంద ర్భంగా ఆయన ప్రకటించారు.
Telangana: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పోలీసు అధికారులు తలదించుకునేలా చేసింది. ఓ చిన్న గొడవనే పెద్దదిగా చేసి యువకులను పోలీసులు మానసికంగా వేధించారు. అంతేకాకుండా పోలీసులు తీరుతో మనస్థాపం చెందిన ఓ యువకుడు ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు.
వక్ఫ్ చట్టాన్ని సవరణ పేరు తో సమాధి చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోం దని, అది ఎంత మాత్రం సహించబోమని ఆల్ ఇండియా తంజీమే-ఈ-ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అజీజ్‌పాష హెచ్చరించారు.
జోగుళా ంబ రేంజ్ పోలీస్ డ్యూటీ మీట్‌లో మహ బూబ్‌నగర్ జట్టు విజే తగా నిలిచింది. రెండ్రో జులుగా మహబూబ్ నగర్ పోలీస్ మైదా నంలో జోన్ పరిధిలో ని జిల్లాల పోలీస్‌లకు డ్యూటీ మీట్ నిర్వహించారు.
అలంపూర్ జోగు ళాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థాన నూతన పాలక మండలి శుక్రవారం ఏర్పాటైంది. 13 మంది సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించాలని ఒలంపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ సూచించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తిలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు హెలికాప్టర్‌లో కల్వకుర్తికి బయలుదేరి వెళతారు. సాయంత్రం ఐదున్నర వరకు కల్వకుర్తిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రాంగణంలో జైపాల్ రెడ్డి సంస్మరణ సభ జరగనుంది.
జోగులాంబ గద్వాల జిల్లా: ఎర్రవల్లి చౌరస్తాలోని పెట్రోల్ పంపు దగ్గర జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం.. లారీని ఢీ కొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మహబూబ్ నగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరుగుతుంది. మద్దూరు మండలం తిమ్మాజీ పల్లి గ్రామంలో బావాజీ జాతరకు సీఎం హాజరవుతారు.
మహబూబ్‌నగర్ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన జాతర సభ జరగనుంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానున్న సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో సభ జరగనుంది.