మేధస్సు వికాసానికి అయోడిన్ ఉప్పునే వాడండి
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:21 AM
Use iodine salt for intelligence development మేధస్సు వికాసానికి అయోడిన్ ఉప్పును వాడా లని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కేవీ స్వరా జ్యలక్ష్మి సూచించారు.
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కేవీ స్వరాజ్యలక్ష్మి
కందనూలు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : మేధస్సు వికాసానికి అయోడిన్ ఉప్పును వాడా లని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కేవీ స్వరా జ్యలక్ష్మి సూచించారు. అయోడిన్ లోపం రుగ్మ తల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో బాలికల ఉన్నత పాఠశాలలో విద్యా ర్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి ఆరోగ్యా నికి సమతుల ఆహారం అవసరమని, ముఖ్యంగా అయోడిన్ అనే సూక్ష్మ పోషకం చాలా ముఖ్య మైందని తెలియజేశారు. ఆహారంలో అయోడిన్ లోపం వలన గర్భవతుల్లో గర్భస్రావాలు, మాతృ శిశు జననాలు, అంగ వైకల్యంతో శిశువులు పుట్ట డం జరుగుతుందని తెలియజేశారు. అన్ని కూర గాయలు, ఆకు కూరల్లో అయోడిన్ సూక్ష్మ పోష కం లభిస్తుందన్నారు. అయోడిన్ ఉప్పు ప్యాకె ట్‌పై నవ్వుతున్న సూర్యుడు గుర్తు ఉంటుందని, తయారైన తర్వాత ఆరు నెలల్లో వాడాలని, మూత ఉన్న డబ్బాలో నిల్వ ఉంచుకోవాలన్నారు. ప్రొగ్రాం ఆఫీసర్ కృష్ణమోహన్, వెంకటదాస్, శ్రీనివాసులు, మల్లేష్, శ్రీభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.