Home » Mahabubnagar
నార్సిమోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎన్‌ఎంఐఎంఎ్‌స) వర్సిటీలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 18 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు.
గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ జనరల్ గురుకులంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది.
తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా ఉందని డీజీపీ జితేందర్ చెప్పారు.
మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిని కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం(73) కన్నుమూశారు. 22 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆదివారం సాయం త్రం గుండెపోటు రావడంతో డాక్టర్లు అత్యవసర చికిత్స అందించారు.
విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి సిబ్బంది సీపీఆర్ చేస్తూ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
వసతి గృహం వాష్‌రూంకు వెళ్లిన బాలిక అక్కడ కెమెరా ఆన్ చేసి ఉన్న సెల్‌ఫోన్ కనిపించడంతో దిగ్ర్భాంతికి గురైంది. ఆ వ్యక్తి ఎవరో గుర్తించి.. పోలీసులకు పట్టిస్తారనే ఆశతో తండ్రి వయసున్న ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది.
బాగా చదవమని ప్రోత్సహించాల్సిన గురువే నీకు చదువు రాదంటూ హేళనగా మాట్లాడడంతో ఓ గురుకుల విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
రాష్ట్రంలో రైతులు పండించిన సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్నందున.. ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడికి వచ్చి విక్రయించకుండా చూసేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
కన్నవారికి ఎప్పటికప్పుడు అబద్ధం చెబుతూ వచ్చాడు కానీ, వారికి నిజం తెలిసే సమయం దగ్గరపడుతుండటంతో కంగారుపడిపోయాడు. నిజం తెలిసిపోతే తన పరిస్థితి ఏమిటనే భయంతో తీవ్ర ఆందోళన చెందాడు.