Home » Maganti Gopinath
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో మాగంటి గోపీనాథ్ భౌతిక కాయం ఉంచారు. ఆస్పత్రి నుంచి మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని ఇంటికి కుటుంబ సభ్యులు తరలించనున్నారు.
Condolences: బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఏఐజీ ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని అన్నారు.
KCR condolences: బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల.. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సంతాపం ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) కన్నుమూశారు (Death). ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు.ఈ మేరకు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, హైదరాబాద్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. వైద్యానికి ఆయన శరీరం స్పందిస్తోందని సన్నిహితులు చెబుతున్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఏఐజీ హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం మాగంటి గోపీనాథ్‌కి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు.
MLA Maganti Gopinath: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారని తెలియటంతో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం వెంగళరావునగర్ డివిజన్ మధురానగర్ డి-బ్లాక్ పార్కులో రూ.16 లక్షలతో పార్క్ పునర్ నిర్మాణం పనులకు, జి-బ్లాక్‌లో రూ.15.50 లక్షలతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
Telangana: జూబ్లీహిల్స్‌లో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి, సిటీ ఇన్‌చార్జ్ మినిస్టర్ ఫోటోలను లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రెహమత్‌నగర్‌లో ఆందోళనకు దిగిన స్థానిక కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు.