Home » Lucknow
ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శనాస్ర్తాలు సంధించారు. ‘‘మోదీ.. టెంపో బిలియనీర్ల’’ చేతిలో ‘తోలుబొమ్మ రాజు’ అంటూ ఎద్దేవా చేశారు. అదానీ, అంబానీల నుంచి కాంగ్రెస్ టెంపోల్లో నగదు పొందుతున్నట్టు ప్రధాని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై రాహుల్ గాంధీ శనివారం మరోసారి విరుచుకుపడ్డారు.
మహిళా రెజ్లర్‌లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు మరోసారి టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది.
లఖ్‌నవూ లోకసభ బీజేపీ అభ్యర్థిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నామినేషన్ వేశారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామితోపాటు యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి ఉన్నారు. అంతకుముందు లఖ్‌నవూ నగర పుర వీధుల్లో రాజ్‌నాథ్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ రోడ్ షో ప్రారంభానికి ముందు స్థానిక హనుమాన్ సేతు దేవాలయంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అతనో నిత్య విద్యార్థి నాయకుడు. తన 40ఏళ్ల నాయకత్వ కెరీర్‌లో 251 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.
నేడు ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు 34వ మ్యాచ్ మొదలు కానుంది. ఈ కీలక మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియం(Ekana Cricket Stadium)లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లలో ఏ టీం ఎక్కువగా గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
లోక్‌సభ ఎన్నికలు, పండుగల సీజన్ కావడంతో మే 17వ తేదీ వరకూ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో లో 144 సెక్షన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. శాంతిభద్రత విభాగం జేసీపీ ఉపేంద్ర కుమార్ ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ఉన్న సమయంలో (2012-2016) జరిగిన అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు జారీచేసింది. ఢిల్లీలో శుక్రవారం నాడు (రేపు) విచారణకు హాజరు కావాలని కోరింది. సీబీఐ సమన్లు జారీచేసిన అంశంపై సమాజ్ వాదీ పార్టీ స్పందించింది.
సాధారణంగా.. జైలులో ఉన్న ఖైదీలకు బయటి వ్యక్తులతో ఎలాంటి సంప్రదింపులు ఉండవు. ఫోన్‌లో మాట్లాడటం, అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు పలకరించడానికి జైలుకు రావడం తప్పితే.. అంతకుమించి బయటి ప్రపంచంతో వారికి కనెక్టివిటీ అనేది ఉండదు. అంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు ఉన్నప్పటికీ.. లక్నో జైలులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
అయోధ్య రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇతర మతాలకు చెందినవారు అయోధ్య చేరుకుంటున్నారు. వారిలో కొందరు ముస్లింలు ఉన్నారు. 350 మంది ముస్లింలు అయోధ్య రాములోరి దర్శనం కోసం వచ్చారు.
రామ మందిర ప్రారంభోత్సవ వేళ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్నో, నోయిడా, గ్రేటర్ నోయిడాలో 144 సెక్షన్ విధించారు.