Home » Lok Sabha
పార్లమెంటు వెలుపల మీడియాతో బుధవారంనాడు ఆయన మాట్లాడుతూ, అసలేం జరుగుతోందో అర్ధం కావడం లేదని, మాట్లాడేందుకు అవకాశం ఇమ్మని ఆయనను (స్పీకర్) కోరుతున్నప్పటికీ అనుమతించడం లేదని చెప్పారు. ఇది సభ నడిపే పద్ధతి కాదన్నారు.
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఏజ్‌పై కీలక ప్రకటన చేశారు. బుధవారం లోక్ సభకు లిఖితపూర్వక సమాధానాన్ని ఇచ్చారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య రిటైర్‌మెంట్ ఏజ్‌లో ఎందుకు తేడాలు ఉన్నాయన్న దానిపై కూడా స్పందించారు.
ధర్మేంద్ర ప్రధాన్‌పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు ఇస్తూ, ఎన్‌ఈపీపై డీఎంకే ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. స్కూల్ ఎడ్యుకేషన్‌కు నిధులను ఎన్‌ఈపీ అమలుతో కేంద్రం ముడిపెట్టరాదని, ఈ విషయంలో తమ (డీఎంకే) వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.
బడ్జెట్ సమావేశాల సెకెండ్ సెషన్ సోమవారంనాడు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ డీఎంకే వైఖరిపై విరుచుకుపడటంతో పార్లమెంటులో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. డీఎంకే ఎంపీలు నిరసనకు దిగడంతో 30 నిమిషాల పాటు సభ వాయిదా పడింది.
పేదలపై కపట ప్రేమ తమకు చేతకాదని, తాము చేతల మనుషులమని, లక్షలాది మందిని పేదరికం నుంచి ఒడ్డున పడేశామని, మధ్యతరగతి ప్రజానీకాన్ని ఆదుకున్నామని ప్రదానమంత్రి లెక్కలతో సహా చెప్పారు.
పార్లమెంటు బడ్జె్ట్ సమావేశాల్లో రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి లోక్‌సభలో ప్రధాని సమాధానమిస్తూ, రాష్ట్రపతి ప్రసంగం 'వికసిత్ భారత్' లక్ష్యంపై దేశ దృఢసంకల్పాన్ని పునరుద్ఘాటించిందని అన్నారు.
బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లోని సెక్రటరీ, ఎన్ఎస్ఏను కలిసేందుకు అమెరికా వెళ్లానని, మన కాన్సుల్ జనరల్ సమావేశానికి అధ్యక్షత వహించాననీ, అయితే ఏ దశలోనూ ప్రధానమంత్రికి ఆహ్వానం విషయంపై చర్చ జరగలేదని ఎస్ జైశంకర్ తెలిపారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో సోమవారంనాడు చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఉత్పత్తి రంగంలో భారత్ నిలదొక్కుకోలేకపోయిందని, అందువల్లే చైనా ఇక్కడ మకాం వేసిందని అన్నారు.
వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదికను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) ఛైర్మన్ జగదాంబికా పాల్ సోమవారం (ఫిబ్రవరి 3, 2025) లోక్‌సభలో సమర్పించనున్నారు. దీంతోపాటు రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టనున్నారు.
Budget 2025: రూ. 50,65,345 కోట్లతో 2025-26 ఏడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. రక్షణ శాఖకు అధికంగా నిధులు కేటాయించింది కేంద్రం.