Home » Lok Sabha Election 2024
ఈ సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో వైదొలగడంతో అక్కడ రెండు సంచలన రికార్డులు నమోదయ్యాయి. ఆ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీ 10 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి అదరగొట్టింది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకుగానూ 8 జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఎనిమిది జిల్లాల్లో 110 సీట్లు ఉండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 110 సీట్లలో విజయం సాధించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ కన్నతల్లి వైయస్ విజయమ్మ ముందే ఊహంచారా? అంటే ఆమె ముందే ఊహించి ఉండ వచ్చునని ఉమ్మడి కడప జిల్లా వాసులు తాజాగా అభిప్రాయ పడుతున్నారు.
కడప అంటే వైయస్ ఫ్యామిలీ.. వైయస్ ఫ్యామిలీ అంటే కడప. అలాంటి జిల్లాలో తాజా ఎన్నికల ఫలితాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. జిల్లాలోని పలు కీలక అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అధిక్యంలో దూసుకు పోతుంది.
నాలుగు వందల పైచిలుకు లోక్‌సభ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఎన్డీయే పశ్చిమబెంగాల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 41 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ నేత వంగా గీతపై ఘన విజయం సాధించారు. అయితే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కల్యాణ్ బరిలో దిగిన సమయంలో.. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం కూటమి సంచలనం విజయం దక్కించుకుంది. పొత్తులో భాగంగా 144 శాసనసభ స్థానాల్లో పోటీచేసిన టీడీపీ130కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. జనసేన పోటీచేసిన 21 స్థానాల్లో విజయం సాధించింది.
గత పదేళ్లుగా తిరుగు లేని ఆధిపత్యంతో దేశాన్ని పాలించిన బీజేపీకి ఈసారి ఎదురుగాలి వీస్తోంది. 350 స్థానాలు గ్యారెంటీ అని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన జోస్యాలు నిజం కాలేదు. ఈసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ మీద ఆధారపడాల్సి ఉంటుంది.
ఎన్నికల పలితాల్లో ఆంధ్రా ఓటరు.. తన ఓటుతో కొట్టిన దెబ్బకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మైండ్ బ్లాక్ అయి.. గ్రీన్ అయి.. రెడ్ అయిందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఆంద్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభంజనం దిశగా వెళ్తోంది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం దాదాపు కూటమి 150కి పైగా శాసనసభ నియోజకవర్గాల్లో అధిక్యాన్ని కనబరుస్తోంది.