Home » Lok Sabha Election 2024
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల క్రితం హామీ ఇచ్చారని, ఇప్పుడైనా ఆ హామీని నెరవేరుస్తారా? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు బిహార్‌కు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్.. మోదీని ఉద్దేశిస్తూ నాలుగు ప్రశ్నలు సంధించారు. ఆ వీడియోను గురువారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘
ఇండియా కూటమికి అద్భుతమైన ఫలితాలను అందించిన యూపీ ప్రజలకు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. యూపీ వాసులు దేశ ప్రజలకు ధృడమైన సందేశం ఇచ్చారని, రాజ్యాంగ రక్షణకు వారు చూపిన తెగువ అద్భుతమైనదని గురువారం ఎక్స్ వేదికగా కొనియాడారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) శనివారం సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత జరిగే ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చిస్తారని సమాచారం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాలు సాధించి రెండో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.
కొత్తగా కొలువు దీరనున్న 18వ లోక్‌సభకు ఎన్నికైన 543 మంది ఎంపీలలో 251 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. మొత్తం లోక్‌సభ ఎంపీలలో వీరు 46 శాతంగా ఉన్నారు. గత లోక్‌సభలో క్రిమినల్ కేసులున్న ఎంపీల సంఖ్య 233 కాగా ఈసారి మరింత పెరిగింది. 2004లో 125 మంది, 2009లో 162 మంది, 2014లో 185 మంది క్రిమినల్ కేసులున్న వారు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అత్యున్నత చట్టసభకు ఎన్నికవుతున్న క్రిమినల్ నేతల సంఖ్య పెరుగుతోందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయింది. 18వ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలట్ ఓట్లు మినహా ఈవీఎంల్లో 65.79 శాతం మేర పోలింగ్ జరిగినట్లు గురువారం సీఈసీ రాజీవ్ కుమార్ వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, వారి కోసం పనిచేసే ఎగ్జిట్‌పోల్స్ సంస్థలు కలిసి దేశంలోనే భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజున స్టాక్‌మార్కెట్ పతనమవ్వడంతో 5 కోట్ల మంది మదుపరులు భారీగా నష్టపోయారని, రూ.30 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైందని చెప్పారు.
కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీకి అగ్నిపథ్ అంశం తలనొప్పిగా మారేలా ఉంది. సొంతంగా మెజార్టీ దక్కకపోవడంతో టీడీపీ, బిహార్‌లోని జేడీయూ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. ఇలాంటి కీలక తరుణంలో జేడీయూ తన తొలి డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన 48 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల వేళ.. దేశంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు.
ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టనున్నారు. అందుకు ముహుర్తం ఖరారైంది. దీంతో ముచ్చటగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరనుంది. అలాంటి వేళ.. ప్రధాని మోదీకి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జై రాం రమేశ్ నాలుగు ప్రశ్నలు సంధించారు.
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి బలం పుంజుకుంది. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి సైతం గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలకు గెలుచుకుంది. దీంతో లోక్‌సభలో ఆ పార్టీ ప్రతిపక్ష హోదా లభించినట్లు అయింది.