Home » Lok Sabha Election 2024
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో విజయం సాధించింది. ఇక మహారాష్ట్రలోని సంగ్లి నుంచి గెలుపొందిన విశాల్ పాటిల్.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు.
మోదీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కొలువు తీరింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ సమావేశాలు జూన్ 18,19వ తేదీన ప్రారంభం కానున్నాయని ఓ చర్చ అయితే ఢిల్లీ వేదికగా సాగుతుంది. తొలి రోజు ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
దేశంలో ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోమవారం న్యూఢిల్లీలో విడుదల చేసింది. జూలై 10వ తేదీన ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీతోపాటు కేబినెట్ మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయడంతో.. మూచ్చటగా మూడో సారి ఆయన ప్రభుత్వం కేంద్రంలో కోలువు తీరింది.
కీలకమైన ‘లోక్‌సభలో ప్రతిపక్ష నేత’ స్థానం పదేళ్ల తర్వాత భర్తీ కానుంది. గత రెండుసార్లు కాంగ్రెస్ సహా మరే పార్టీ కనీస సంఖ్యలో సీట్లు సాధించకపోవడంతో ఈ పదవి ఖాళీగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ 100 స్థానాల్లో నెగ్గడంతో అర్హత సాధించింది. లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్య 543 కాగా.. ఇందులో పదిశాతం (54) సీట్లు గెలిచిన పార్టీకి ప్రతిపక్ష నేత పదవిని పొందే అవకాశం ఉంటుంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ 44 సీట్లనే సాధించింది. 2019లో 52 స్థానాలతో సరిపెట్టుకుంది.
ఒడిశాలో మాజీ బ్యూరోక్రాట్ వీకే పాండ్యన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నవీన్ పట్నాయక్‌కు సహాయపడే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, అందుకే 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదని తెలిపారు. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, ఈ ప్రయాణంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు.
బీజేపీలో సామాన్య కార్యకర్త స్థాయిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భూపతిరాజు శ్రీనివాస వర్మ నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించడమే అనూహ్యం. అంతే అనూహ్యంగా ఆయనకు కేంద్రమంత్రిగా కూడా అవకాశం దక్కింది. 1967 ఆగస్టు 4న జన్మించిన ఆయనకు.. రొయ్య సాగు, వాణిజ్యంలో 20 ఏళ్లు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. 1991 నుంచి 95 వరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా, 1995 నుంచి 97 వరకు పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు.
నీట్-2024 రగడ దేశాన్ని కుదిపేస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఫలితాలు విడుదలైనప్పటి నుంచి విపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. నీట్ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు.
అదృష్టం ఉంటే చాలు.. దేనికోసం మనం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు.. అదే మన అడ్రస్ వెతుక్కుంటూ వస్తుందనే సామెత ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ఎంపీ టికెట్ కోసం పైరవీలు చేయలేదు.. పార్టీ కోసం కష్టపడి పనిచేయడమే ఆయనకు తెలుసు.. టికెట్ కావాలంటూ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టలేదు.. అధిష్టానం పెద్దలను అడగలేదు.
ఎన్నికల ముందు వరకు ఏపీలో చర్చంతా ఆయన గురించే.. నామినేషన్ వేసిన రోజు నుంచి ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు గుంటూరు లోక్‌సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో పెద్ద వైద్యుడిగా పేరు సంపాదించిన ఆయన ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.