Home » Kutami
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం వ్యవసాయం, ఉద్యాన రంగాలపై దృష్టి పెట్టి వృద్ధి రేటు సాధించేందుకు ప్రయత్నం చేయాలని, టెక్నాలజీని అందిపుచ్చుకోవటం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉందని అన్నారు.
గతంలో అధికారంలో ఉండగా ఏకపక్షంగా స్థానిక సంస్థల్ని గెల్చుకున్న వైఎస్సార్‌సీపీకి ఇప్పుడు కార్పోరేటర్లు, కౌన్సిలర్లు వరుస షాకులిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా గుంటూరు నగర పాలక సంస్ధలోనూ ఇదే పరిస్ధితి ఎదురైంది. గుంటూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్‌సీపీ ఆధిపత్యానికి తాజాగా గండి పడింది.
తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగింది. ఈరోజు జరిగిన ఎన్నికలో కూటమి అభ్యర్థి, టీడీపీ నేత ఆర్సీ మునికృష్ణ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 26.. వైఎస్సార్‌సీపీకి 21 ఓట్లు పోలయ్యాయి. దీంతో కూటమి అభ్యర్థి గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
కూటమి ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది. వాట్సాప్ గవర్నెన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీలో గురువారం నుంచి వాట్సాప్ గవర్నెన్స్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఇది గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. దీనిద్వారా మొదటి విడతగా 161 సేవలను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ 3వ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు. తద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
నిరుపేదలకు మేలు చేసే మరో కీలక నిర్ణయం కూటమి సర్కారు తీసుకుంది. నివాసం కోసం పేదలు ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్న ప్రభుత్వ భూముల్లో అభ్యంతరం లేని వాటిని క్రమబద్ధీకరించాలని రెవెన్యూశాఖను ఆదేశించింది. ఈ మేరకు క్రమబద్ధీకరణకు అనుమతి ఇస్తూ రెవెన్యూశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపి ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా విశాఖ ఉక్కుకు ఉపశమనం కలిగేలా భారీ ప్యాకేజీ ప్రకటించడంతో కేంద్రానికి ఏపీ కేబినెట్ ధన్యవాదాలు తెలపనుంది.
అమరావతి రైతులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు సంక్రాంతి పండుగ సందర్బంగా కౌలు డబ్బులు వారి అకౌంట్లలో జమ చేశారు. భూములిచ్చిన రైతులకు పదో ఏడాదికి సంబంధించిన కౌలు చెల్లింపులు చేశారు. సంక్రాంతి పండుగ వేళ డబ్బులు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ పండుగను సంతోషంగా జరుపుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గడిచిన ఆరు నెలల పాలన రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2717 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. పల్నాడు జిల్లా, నర్సరావుపేట మండలం, ఎలమంద గ్రామంలో సీఎం చంద్రబాబు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లు అందజేస్తారు.