Home » Kuppam
ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటనకు సర్వం సిద్ధమైంది. కుప్పంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలలో చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం బుధవారం జరగనుంది.
చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నీటిలో మునిగి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. కుప్పంలో ముగ్గురు, బుట్టాయగూడెంలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ జల సమాధి చెందారు.
కుప్పానికి ‘వాహన’యోగం పట్టింది. రెండు అంబులెన్స్‌లు, నాలుగు ఈ-ఆటోలు ఇప్పటికిప్పుడు రావడమే కాదు, ఇంకో 90 దాకా ఈ-ఆటోలకు ఒప్పందం కుదిరింది. ఒప్పందమంటే ఇదేదో నగదు చెల్లించే పరస్పర ఒప్పందం కాదు, ఉచితంగా అన్ని ఆటోలూ కుప్పం చేరబోతున్నాయి.
కుప్పంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. క్షేత్ర స్థాయి సిబ్బందే కాదు, మండల స్థాయి అధికారుల పోస్టులు కూడా ఖాళీగానే ఉండి, ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. మరోవైపు సాధారణంగా జరిగే ఉపాధి పనులతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన సిమెంటు రోడ్లు, గోకులం షెడ్ల నిర్మాణం కూడా ఉపాధి హామీకి అనుసంధానించడంతో పని ఒత్తిడి ఎక్కువై సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.
మున్సిపల్ కార్యాలయానికి మంజూరు చేసిన 44 పోస్టులు భర్తీ కాకపోవడంతో పని వత్తిడి ఏమాత్రం తగ్గడంలేదు.
భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల విలువలు రేపటి నుంచి పెరగనున్నాయి. ఇందుకు అనుగుణంగా రిజిస్ర్టేషన్ ఛార్జీల ధరలూ పెర గనున్నాయి.
కుప్పం గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థ (రెస్కో) సర్వం అవినీతి మయంగానే ఉందా? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ సంస్థలో ఇక్కడ అక్రమాలు చోటు చేసుకున్నాయా? సిబ్బంది నియామకాలు, కొనుగోళ్లు, ఆడిట్ రిపోర్టులు, చివరకు మినిట్స్ బుక్కుల్లో కూడా అవకతవకలు జరిగాయా? ఇటువంటి అన్ని ప్రశ్నలకూ అవుననే సమాధానమే లభిస్తోంది.
సంక్రాంతి పండగకు తన స్వగ్రామం నారావారిపల్లికి వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
సొంత నియోజకవర్గం కుప్పం నుంచి వినూత్న ప్రయోగాలు చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.