Home » Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పెళ్లి కొడుకు కోయ భాష మీద అభిమానం చాటుకున్నారు. కోయ భాష మీద ప్రేమతో పెళ్లికొడుకు ఉండమీరి శ్రీనివాస్ ఆ భాషను తన పెళ్లి పత్రికపై ముద్రించాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం, నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సర్వే బృందం గురువారం పరిశీలించింది.
గాంధీభవన్‌లో బుధవారం జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చీకటి కార్తీక్ ఎన్నికపై ఆ జిల్లాకు చెందిన పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదం రాజుకుంది.
Kunamneni Sambasivarao: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు తెలంగాణ హైకోర్టులోనే కాదు.. సుప్రీంకోర్టులో సైతం గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనం వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉత్తర ద్వార దర్శనంకు భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ పరిసరాలు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.
కొత్తగూడెం సింగరేణికి చెందిన ఓ వ్యక్తి ఐదేళ్ల క్రితం మృతిచెందారు. పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే ఆయమ ప్రాణాలు విడిచారు. అనంతరం కుటుంబ భారం అంతా కుమారుడిపై పడింది. దీంతో అతను కుటుంబానికి ఆసరాగా నిలిచాడు.
రాష్ట్రంలో మరో నగరపాలక సంస్థ ఏర్పాటు కానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు ఉండగా.. కొత్తగూడెం పురపాలక సంస్థను నగర పాలక సంస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి కంపించింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత 5 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.27 గంటల సమయంలో ములుగులోని మేడారం కేంద్రంగా 3-7 సెకన్ల పాటు కొనసాగిన ప్రకంపనలతో కొన్ని చోట్ల ఇళ్ల గోడలు, నేల బీటలువారాయి.
ములుగు ఏజన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు మావోయిస్టుల ఎన్‌కౌంటర్.. మరోవైపు సోమవారం నుంచి మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముమ్మరంగా కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిలిపివేశారు.
సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరించాలని, రూ.19,800 కోట్లకు పెంచాలని కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్(సీఈ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.