Home » KonaSeema
చల్లపల్లి ఓఎన్జీసీ సైట్‌లో జీఎండీఏ-14 బావి నుంచి బుధవారం అర్ధరాత్రి బ్లోఅవుట్‌ను తలపించేలా భారీ శబ్దాలు వెలువడ్డాయి. అర్ధరాత్రి ఏమి జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో బెస్తవారిపేట, గోపవరం మెయిన్, కోటమాయమ్మకాలనీ, జగ్గరాజుపేట, అయితాబత్తులవారిపేట పరిసర ప్రాంతాల జనం భయాందోళనకు గురయ్యారు. బ్లోఅవుట్ భయంతో పరుగులు తీఽశారు. విషయాన్ని కొందరు ఓఎన్జీసీ అధికారులకు తెలియజేశారు.
బాణసంచా విక్రయాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని అమలాపురం ఆర్డీవో కె.మాధవి హెచ్చరించారు. ఆర్డీవో కార్యాలయంలో బుధవారం దీపావళి పండుగ నేపథ్యంలో భద్రతా అంశాలపై రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, కార్మికశాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ధాన్యం కొనుగోలులో సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ధాన్యం రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు సిబ్బందికి బుధవారం నిర్వహించిన సాంకేతిక శిక్షణా తరగతుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు.
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలంకరణ, సుంగధ పరిమళాలు వెదజల్లే వేద పండితుల మంత్రోచ్ఛరణ, కళాకారుల ప్రదర్శనలు, భక్తజన గోవిందనామస్మరణల నడుమ వాడపల్లి పులకించిం ది.
రాజకీయ పలుకుబడి... అప్పటి వైసీపీ ప్రభుత్వ అధికార బలంతో హత్య కేసును సైతం నిర్వీర్యం చేసి మరుగున పెట్టించేశారు. నిందితులంతా హ్యాపీగా తిరుగుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో విచారణకు నోచుకోని హత్య కేసులను పునర్విచారణ చేపట్టారు.
నిరుద్యోగాన్ని ఆ పాస్టర్ ఆసరా చేసుకున్నాడు. ఇజ్రాయోల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మబలికాడు. ఆయన మాటలు నమ్మి కోట్లాది రూపాయిలు ఆ పాస్టర్ చేతిలో పెట్టారు. కాలం గడుస్తున్నా.. పాస్టర్ ఇజ్రాయోల్ పంపడు. తీసుకున్న నగదు ఇవ్వడు. దీంతో తమ నగదు తమకు ఇవ్వాలంటూ పాస్టర్‌ను నిరుద్యోగులు నిలదీశారు. దాంతో చంపేస్తానంటూ వారిని పాస్టర్ బెదిరించాడు. జిల్లా ఉన్నతాధికారులను నిరుద్యోగులు ఆశ్రయించారు. ఈ విషయాన్ని పసిగట్టిన పాస్టర్ నగదుతో ఆదృశ్యమయ్యాడు.
ఆత్రేయపురం(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ చవితి సోమవారం నుంచి 29 మంగళవారం వరకు తొమ్మిది రోజుల పాటు తిరుమల తరహాలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎప్పుడూ లేని విధంగా ప్రచార మాధ్యమాల ద్వారా భక్తులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనకా
రాకాసి అలలు తీరం వెంబడి అలజడి సృష్టిస్తున్నాయి.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.. ఒక్కసారిగా అలలు బీభత్సం సృష్టించడంతో జియో ట్యూబ్ రాళ్ల కట్టుబడి దెబ్బతింది.
జిల్లాలో ప్రతిభావంతులైన పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సాంఘిక, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జి.జ్యోతిలక్ష్మీదేవి తెలిపారు. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ పేద అభ్యర్థులు డీఎస్సీలో ఉత్తమ ఫలితాలు పొందేందుకు ప్రభుత్వం ఉచిత శిక్షణను ఏర్పాటు చేసిందన్నారు.
మండపేట మండలం ద్వారపూడి పంచా యతీ గ్రామ సర్పంచ్ ఈతకోట కిన్నెర చెక్‌పవర్‌ను రద్దు చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీలో నిర్మించిన సుబ్రహ్మణ్యేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో పాలకవర్గం అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలతో పాటు పంచాయతీ బైలాను అమలు చేయకుండా పాలకవర్గం ఇష్టానుసారం వ్యవహరించిన తీరును అధికారులు తప్పుబట్టారు.