Home » Kiran Kumar Reddy
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి రాజకీయాలు చేస్తున్నాయని తమ నేతలు మొదటి నుంచి చెబుతునే ఉన్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు కవిత వ్యాఖ్యలు దాన్ని నిజం చేశాయని అన్నారు.
MP Chamala Kiran Kumar Reddy: మిస్ వరల్డ్ పోటీలను తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని .. కానీ ఆ పోటీలను చూసి కేటీఆర్ అసూయ పడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అందాల పోటీలు కేటీఆర్ ఊసు లేకుండా జరుగుతున్నాయని బాధపడుతున్నారని తెలిపారు.
Telangana Government: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించి మాక్ డ్రిల్ చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.
Congress: సీఎం రేవంత్‌రెడ్డికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ లేఖ రాశారు. తెలంగాణలో వేముల రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని రాహుల్‌గాంధీ కోరారు. ఈ లేఖపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు.
Kiran Kumar Reddy: ప్రపంచ తెలుగు మహాసభలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనుక ఏదో కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
KIRAN KUMAR REDDY: వరి వేస్తే ఊరి అని నిబంధనలు పెట్టిన బీఆర్ఎస్‌కు రైతుల గురించి మాట్లాడే అర్హతలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జీవితాంతం అధికారంలో ఉంటామని కేటీఆర్ భావించారని చెప్పారు. ముఖ్యమంత్రి వస్తే మంత్రులు లేవలేదని సోషల్ మీడియా ద్వారా చిల్లర కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు.
MP Chamala Kiran Kumar Reddy: రైతు భరోసా విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్ల రైతు బంధులో రూ.22 వేల కోట్లు అనర్హులకు ఇచ్చారని ఆరోపించారు. ఈ ఫార్ములా కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.
బీజేపీ నేతలకు త్రివర్ణ పతాకం పట్ల కూడా భక్తి లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అంబేద్కర్ పట్ల అమర్యాదగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చింది.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై తమకు బాధ్యత ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఇచ్చిన హామీలను అమలు పరిచి ముందుకువెళ్తున్నామని తెలిపారు. ఏడాది పాలన ప్రచారంలో ఎంపీలను భాగస్వాములు కావాలని కోరారు.
లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ను కేవలం తెలంగాణలో ఎన్నికల ఖర్చుల కోసం రూ.7 వేల కోట్లకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అమ్ముకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆక్షేపించారు. రాజకీయాల్లో హుందాతనం అవసరమని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బుద్ధితెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.