Home » Kids Health
పుట్టిన పిల్లలకు తల్లిపాలే ఆహారం అవుతాయి. దాదాపు 6 నెలల వరకు తల్లిపాలు, కుదరకపోతే ఫార్ములా పాలు తప్ప వేరే ఏమీ ఇవ్వకూడదు పిల్లలకు. కానీ 6నెలలు దాటిన తరువాత మెల్లిగా వారు తినగలిగే, జీర్ణం చేసుకోగలిగే ఆహారాలను చేర్చమని ఆహార నిపుణుల నుండి పిల్లల వైద్యుల వరకు అందరూ సిఫారసు చేస్తారు. ఎందుకంటే..
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి బ్లడ్ కేన్సర్ బారి నుంచి బయట పడిందన్న సంతోషం ఆ కుటుంబానికి ఎంతో కాలం నిల్వలేదు. రోగం తిరగబెట్టడంతో ఆ చిన్నారిని మళ్లీ ఆస్పత్రి పాలైంది. ఇప్పటికే వైద్యానికి లక్షలు ఖర్చుపెట్టిన ఆ తల్లిదండ్రులు ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నారు. ఈ స్థితిలో తన బిడ్డకు మెరుగైన చికిత్స అందించడానికి దాతలు సహకరించాల్సిందిగా వేడుకుంటున్నారు.
పండ్లు, పండ్ల రసాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఆహారం నుండి పానీయాల వరకు అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా జ్యూసులు చిన్న పిల్లలకు ఇవ్వవచ్చా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. జ్యూసులు మంచి శక్తిని ఇస్తాయి. ద్రవాలు కాబట్టి జీర్ణం కావడంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే చిన్న పిల్లలకు జ్యూసులు ఇవ్వడం మంచిదేనా?
పెద్దవాళ్లు అయితే ఇష్టం లేకపోయినా ఆరోగ్యం కోసం, రోగనిరోధక శక్తి కోసం కొన్ని రకాల ఆహారాలను బలవంతంగా అయినా తీసుకుంటూ ఉంటారు. కానీ చిన్న పిల్లలు తమకు నచ్చని ఆహారాన్ని తినడానికి అస్సలు ఇష్టపడరు. ఈ కారణంగా పిల్లలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.
చిన్న పిల్లలను అటు వేడికి వదిలేయలేము ఇటు ఏసీలో ఏ ఆందోళన లేకుండా పడుకోబెట్టలేము. AC లేదా కూలర్ గాలిలో చిన్న పిల్లలను ఎలా నిద్రపుచ్చాలో.. గుర్తుంచుకోవలసిన విషయాలేంటో..
ఆడుతూ పాడుతూ అల్లరి చేసే చిన్న పిల్లలలో అధిక రక్తపోటు ఎదురుకావడం అనేది ఎప్పుడైనా విన్నారా? ప్రస్తుతం చాలా మంది పిల్లలు ఈ అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య వల్ల ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయంటే..
లాలాజలం, శ్వాసకోశ స్రావాలతో గవదబిళ్లలు వ్యాపిస్తాయి. పిల్లల్లో ఈ సమస్య వ్యాప్తికి అనేక కారణాల్లో ఇది కూడా ఒకటి.. వ్యక్తిగత వస్తువులను తాకడం,. పంచుకోవడం, దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు కూడా సన్నిహితంగా ఉండటం వల్ల కూడా గవదబిళ్లలు వస్తాయి.
పిల్లలు తల్లిదండ్రుల పక్కన పడుకోవడం అనేది మంచి విషయమే అయినా, తల్లిదండ్రులకు అది బాగా అనిపించినా పిల్లల భవిష్యత్తుకు మాత్రం అది ఎంతమాత్రం మంచిది కాదు.. ప్రయాణాలు చేయ్యాల్సి వచ్చినప్పుడో, తల్లిదండ్రులు దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడో.. పిల్లలు చదువుల కోసం దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడో చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు.
పిల్లలు కూడా జిమ్ చేయవచ్చా.. జిమ్ కు వెళ్లాలంటే పిల్లల వయసు ఎంత ఉండాలి? దీని గురించి ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారు? చిన్న వయసులోనే పిల్లలు జిమ్ కు వెళితే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి?
పెరుగుతున్న పిల్లలకు పుష్కలమైన పోషకాహారాన్ని అందించడానికి తల్లిదండ్రులు కష్టపడుతుంటారు. సహజంగా ఎముకలను బలోపేతం చేసే ఆహారాలు ఇక్కడ ఉన్నాయి.