Home » Kesineni Nani
విజయవాడ ఎంపీ కేశినేని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్‌సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) సభకు కేశినేని నాని ( Keshineni Nani ) ని పిలవకపోవడం సరైనది కాదని తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ( Nallagatla Swamidasu ) తెలిపారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరువూరు గొడవ దురదృష్టకరమని చెప్పారు. కేశినేని నాని మనసులో బాధ పడుతున్నారన్నారు. చంద్రబాబు సభకు తానూ వెళ్లనని నల్లగట్ల స్వామిదాసు చెప్పారు.
సోషల్ మీడియాలో వచ్చిన ఎంపీ కేశినేని నాని ట్వీట్‌కు.. తనకు ఎటువంటి సంబంధం లేదని కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. తమ దృష్టంతా తిరువూరు సభను విజయవంతం చేయడమే మీదే ఉందన్నారు. పార్టీలో తానొక సామాన్య కార్యకర్తనేనన్నారు.
Andhrapradesh: ఫేస్‌బుక్ పోస్ట్‌లో అన్ని వివరాలు సవివరంగా పెట్టానని.. అంతకు మించి కొత్తగా చెప్పేదేమీ లేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. శుక్రవారం కేశినేనిభవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఎంపీ మాట్లాడుతూ.. రాముడికి ఆంజనేయ భక్తి తరహాలోనే అధినేత ఆదేశాలు శిరసావహిస్తా అని స్పష్టంగా ఫేస్‌బుక్‌లో పెట్టానన్నారు.
Andhrapradesh: నీతినిజాయితిపరులే రాజకీయాల్లోకి రావాలి అంటూ ఎంపీ కేశినేని నాని కీలక వాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్‌గా మారిందన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4యేళ్ల 9నెలలు అయ్యిందని.. ఈ సమయంలో అన్ని రంగాల్లోనూ సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఎంపీ కేశినేని నాని అన్నారు.
విజయవాడ: కోవిడ్ తరువాత పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఙతలు తెలుపుతున్నానని తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు.
Andhrapradesh: రాజకీయ పార్టీల మధ్య పొత్తులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో పొత్తులు కొత్త కాదన్నారు.
తెలుగుదేశం..మీసం తిప్పుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై పార్లమెంటులో గళమెత్తిన టీడీపీ ఎంపీలకు అభినందనలు తెలిపారు. ఢిల్లీలో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. చంద్రబాబుని తప్పుడు కేసులో అక్రమ అరెస్టు చేయించిన సైకో జగన్ తీరుపై దేశమంతా చర్చకు వచ్చేలా చేసిన టీడీపీ ఎంపీలను నారా లోకేశ్ అభినందించారు.
వైసీపీ ప్రభుత్వం(YCP Govt) కక్షపూరితంగా నేడు చంద్రబాబును అరెస్ట్(Chandrababu arrested) చేయడం భారతదేశ చరిత్రలో చీకటి రోజు, దుర్ధినమని టీడీపీ ఎంపీ కేశినేని నాని(TDP MP Keshineni Nani) అన్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు.