Home » KCR
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి వరదలై పారిందని ఘోష్ కమిషన్ నివేదిక కుండబద్దలు కొట్టింది. దీనంతటికీ కేసీఆర్ పూర్తి బాధ్యుడని సూటిగా చెప్పింది. బ్యారేజీల కుంగుబాటు వ్యవహారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగింది కాబట్టే ఆ ప్రాజెక్టు మాటున సాగిన దారుణాలు బయటికి వచ్చాయి.
గత నెల 25న తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను అనుమతించిన సుప్రీం ధర్మాసనం.. పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలను వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై ఇవాళ(బుధవారం) విచారణ జరిగే అవకాశం ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాస్ చేస్తూ.. కేసీఆర్, హరీష్ రావులు రెండు పిటిషన్లు ధాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికలో సూత్రధారులుగా ఇరువురి పేర్లను ఘోస్ కమిషన్ ప్రస్తావించిన విషయం తెలిసిందే.
కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్లక్ష్యం, అక్రమాలపై విచారణ కోసం వేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అక్రమమంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. అందులో భాగంగానే కేసీఆర్, హరీష్‌రావు.. తెలంగాణ హైకోర్టున ఆశ్రయించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ ప్రభుత్వం కమిషన్ వేసిందని ఆరోపించారు.
గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించింది? ఆపరేషన్ కగార్‌ను ఆపి నక్సలైట్లతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్లారు. తన చిన్న కుమారుడు ఆర్య గ్రాడ్యుయేషన్ చదివేందుకు అమెరికా వెళ్తున్న సందర్భంగా అతనికి తాత ఆశీర్వాదం ఇప్పించాలని కవిత భావించారు.
బీఆర్ఎస్ కీలక నేతలు అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎర్రవల్లి ఫాంహౌస్‌కు క్యూకడుతున్నారు. కేటీఆర్, హరీశ్ సహా ముఖ్య నేతలు ఇప్పటికే ఎర్రవల్లి ఫాంహౌస్ కు బయల్దేరినట్టు సమాచారం. మరికాసేపట్లో జరిగే భేటీలో పలు అంశాలు చర్చించే..
కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ లీక్ తర్వాత కవితను కేసీఆర్, కేటీఆర్‌లు దూరం పెట్టారన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ సమయంలో ఫాంహౌస్‌కు కవిత వెళ్లింది.
భారత స్వాతంత్ర్య సమరాన్ని నిరాయుధ, శాంతియుత పద్ధతిలో మహాత్మాగాంధీ నడిపారని కేసీఆర్ కొనియాడారు. అహింసా పద్ధతిలో నడిచిన దేశ స్వాతంత్ర్య పోరాట కార్యాచరణ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఇమిడి ఉందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.