Home » KCR
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ అందించిన నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ ముందుంచారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నివేదికలోని సంచలన విషయాలు బయటపెట్టారు.
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. గువ్వల బాలరాజుతో పాటు మరో ఇద్దరు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపించారు.
కేసీఆర్‌కు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సిట్ ఏర్పాటు యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు సమాచారం.
కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా బీఆర్‌ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై సర్కారు క్రిమినల్ చర్యలు చేపట్టే అవకాశముందన్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌తో ముఖ్య నేతలు భేటీ అయ్యారు.
కాళేశ్వరం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ మాత్రమే కాదు.. ధరలు, కాంట్రాక్టుల సవరణల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, వైఫల్యాల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీలకమని జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్ తేల్చింది. ఈ విషయంలో ఆయన పాత్ర విస్మరించలేనిదని తెలిపింది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో ఆ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర నేతలు భేటీ అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కుతోందని, బెదరింపులకు భయపడవద్దని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ మళ్లీ కీలకం కావాలంటే, లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి.. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు .. రేవంత్ రెడ్డికి లొల్లి ఎక్కువ అంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్. మళ్ళీ అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వానికి, పార్టీకి సమ న్యాయం చేస్తామని..
బీఆర్ఎస్ పాలనలో వేల మంది ఫోన్లను ట్యాప్ చేశారని, నాటి సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆరోపించారు.