Home » Kavitha Arrest
దిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( kavitha ) ను ఈడీ అరెస్టు చేసింది. కవిత అరెస్టుతో రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి.
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అరెస్ట్ వ్యతిరేకిస్తూ పార్టీ శ్రేణులు రోడ్లుపైకి వచ్చాయి. ఇప్పటికే కవిత నివాసం ముందు బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. ఇక కవిత అరెస్ట్ వార్తను తెలుసుకున్న గులాబీ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కవిత అరెస్ట్ అక్రమమంటూ మండిపడుతున్నారు.