Home » Kanna Lakshminarayana
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) అరాచకాలను ప్రశ్నించినందుకే తనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దించే కుట్ర చేశారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర సహకార రంగాన్ని వైసీపీ ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా మార్చుకుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి వైసీపీ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు సహకార రంగంలో రూ.5వేలకోట్ల దోపిడీ జరిగిందన్నారు. దీనిపై దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే కేంద్రహోంమంత్రి అమిత్ షాకు, నాబార్డ్ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
టీడీపీలో నెలకొన్న పరిస్థితులు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏం జరుగుతోంది..? ఫౌండేషన్ల పేరుతో జరుగుతున్న హడావుడి..? కోడెల శివరాం వ్యవహారం..? ఇలా అన్ని విషయాలపైనా...
సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి నియామకంపై ఉత్కంఠకు టీడీపీ తెరదించింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలను అప్పగించింది. ఈ మేరకు నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
తనకు సత్తెనపల్లి సీటు కేటాయించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా కార్యకర్తలు, ప్రజలతోనే ఉంటానన్నారు. అభివృద్ధి ప్రాధాన్యమిస్తానన్నారు. సత్తెనపల్లిలో ఎలాంటి గ్రూపులూ లేవని కన్నా తేల్చి చెప్పారు. కోడెల కుటుంబంతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. జిల్లాలో వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ వైరం లేదని.. అందరం కలిసి ముందుకు సాగుతామని కన్నా తెలిపారు.
టీడీపీ మహానాడు అద్భుతంగా జరిగిందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తొలి విడత మ్యానిఫెస్టోను విడుదల చేశారని... మహిళలకు, యువతకు, రైతులకు, బీసీలకు ఏం చేస్తారో ఇందులో చెప్పారని తెలిపారు.
అకాల వర్షం వలన రైతులు రోడ్డున పడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు మన నీరో తాడేపల్లి పాలస్‌లో కూర్చుని చోద్యం చూస్తున్నాడని టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు.
గత వారం రోజులుగా వర్షాలకు పంటలు దెబ్బతింటే వైసీపీ సర్కార్ మొద్దు నిద్రపోతుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ విమర్శలు గుప్పించారు.
త్తెనపల్లిలో టీడీపీ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు రానున్న నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
సాగు నీటి కోసం ఈ నెల 18న నరసరావుపేట (Narasaraopeta) కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్టు టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) తెలిపారు.