Home » Kamareddy
తెలంగాణ రాజకీయాల్లో కామారెడ్డి సెంటర్ పాయింట్‌గా మారింది. ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ బరిలోకి దిగడమే ఇందుకు కారణం. బీబీపీట మండలంలోని కోనాపూర్ కేసీఆర్ అమ్మ వాళ్ళ ఊరు.
కామారెడ్డి జిల్లా: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం కామారెడ్డి జిల్లా, బీర్కూర్ మండలం, స్తంభపూర్, భైరాపూర్ గ్రామాల్లో పర్యటించారు. కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణం వంద కోట్ల రుపాయలతో అభివృద్ధి చెందిందన్నారు. 8 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మించబోతున్నామని తెలిపారు.
జిల్లాలో సైబర్ మోసం (Cyber fraud)వెలుగులోకి వచ్చింది. ఆర్మీ జవానని అంటూ నమ్మించి 40 మంది ఆర్మీ జవాన్లకు ఒకేసారి రక్త పరీక్షలు నిర్వహించాలని కామారెడ్డికి చెందిన సూర్ సింగ్ అనే ల్యాబ్ టెక్నీషియన్‌కు సైబర్ కేటుగాడు ఫోన్ చేసి నమ్మించాడు.
పెళ్లి రోజే పెళ్లి కుమారుడు శవమై కనిపించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సదాశినగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి కి చెందిన ముసర్ల రాజేందర్ రెడ్డి (29) కి ధర్పల్లి మండలానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఐదు రోజుల క్రితం కటింగ్ కోసమని రాజేందర్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
కాంగ్రెస్ పార్టీ చెప్పినది చేస్తోందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు.
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లాలో అంతుచిక్కని శిశు మరణాలు సంభవించాయి. నెలరోజుల వ్యవధిలోనే ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. మరణించిన వారందరు నాలుగు నెలల లోపు చిన్నారులు...
అవును.. గజ్వేల్‌తో (Gajwel) పాటు కామారెడ్డి (Kamareddy) అసెంబ్లీ నుంచి కూడా పోటీచేస్తున్నాను.. ఎందుకు సార్ అంటే.. పార్టీ డిసైడ్ చేసింది.. ఏం చేద్దాం అంటావ్.. పార్టీకి లేని ఇబ్బంది మీకేంటి..? ఇవీ ప్రగతి భవన్ వేదికగా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా (BRS First List) రిలీజ్ చేసే క్రమంలో గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన కామెంట్స్. కేసీఆర్ అనుకున్నట్లుగానే రెండు చోట్ల నుంచీ పోటీచేస్తారు సరే..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఈసారి స్వయంగా సీఎం కేసీఆరే బరిలో ఉండనున్నారు. జిల్లాలోని మరో మూడు నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ కేటాయిస్తూ కేసీఆర్ ప్రకటించారు.
గత కొంత కాలంగా కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారని బీఆర్‌ఎస్ లీకులిచ్చేసింది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే కేసీఆర్ పోటీపై ప్రజల మనోభావాలు తెలుసుకునేందుకు కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పలు సర్వేలు కూడా చేసింది. సర్వేలన్నీ పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండటంతో కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడం ఖాయమైంది.