• Home » Kamareddy

Kamareddy

Assembly Criticism: సభలో భజన బృందం ఎక్కువైంది

Assembly Criticism: సభలో భజన బృందం ఎక్కువైంది

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ను ఎన్నికల్లో ఓడించి కామారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

TG Politics: అసెంబ్లీలో భజన బ్యాచ్‌ ఎక్కువైపోయింది.. కామారెడ్డి ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..

TG Politics: అసెంబ్లీలో భజన బ్యాచ్‌ ఎక్కువైపోయింది.. కామారెడ్డి ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..

అసెంబ్లీలో భజన బ్యాచ్ ఎక్కువైపోయిందన్నారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందన్నారు.

Minister Jupally: కేసీఆర్ చేసిన అప్పుకు ప్రతినెలా రూ.5వేల కోట్లు వడ్డీ కడుతున్నాం..

Minister Jupally: కేసీఆర్ చేసిన అప్పుకు ప్రతినెలా రూ.5వేల కోట్లు వడ్డీ కడుతున్నాం..

తెలంగాణలో రైతు రుణమాఫీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, రైతులు సంబరాలు చేసుకుంటున్నారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లుగా చేయలేని పనిని తాము చేసి చూపించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా భిక్కనూరులో నిర్వహించిన రుణమాఫీ సంబరాల్లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు.

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి

Telangana: జిల్లాలోని బిక్కనూరు మండలం సిద్దరామేశ్వరనగర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Crime News:  కామారెడ్డి జిల్లా: సైబర్ వలలో మోసపోయిన వ్యక్తి..

Crime News: కామారెడ్డి జిల్లా: సైబర్ వలలో మోసపోయిన వ్యక్తి..

కామారెడ్డి జిల్లా: పల్వంచ మండలం, భవానిపేట గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అనే వ్యక్తి సైబర్ వలలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సైబర్ కేటుగాళ్లు వెంకట్ రెడ్డికి ఫోన్ చేశారు. అమెరికాలో ఉంటున్న మీ కుమార్తె మాధవి ఆపదలో ఉందని.. బెదిరింపు కాల్ చేశారు. ఆమె ఉంటున్న గదిలో మరో అమ్మాయి హత్యకు గురైందంటూ ఈ కేసు నుంచి మీ కూతురును తప్పించాలంటే రెండు లక్షలు ఖర్చవుతుందని, డబ్బులు పంపాలంటూ ఫోన్ చేశారు.

Kamareddy: డిప్యూటీ తహసీల్దార్‌ వేధింపులు తాళలేక.. రికార్డు అసిస్టెంట్‌ ఆత్మహత్య

Kamareddy: డిప్యూటీ తహసీల్దార్‌ వేధింపులు తాళలేక.. రికార్డు అసిస్టెంట్‌ ఆత్మహత్య

డిప్యూటీ తహసీల్దార్‌ వేధింపులు తాళలేక ఓ రికార్డు అసిస్టెంట్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్‌ శివారులో శనివారం జరిగిన ఈ ఘటనలో తెడ్డు ప్రశాంత్‌(28) అనే యువకుడు బలవన్మరణం పొందాడు.

Kamareddy: లింగ నిర్ధారణ దందా.. శిశువు విక్రయం

Kamareddy: లింగ నిర్ధారణ దందా.. శిశువు విక్రయం

ఆ ఇద్దరు వైద్యులు తండ్రీకొడుకులు! చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. పుట్టబోయేది ఆడబిడ్డో, మగబిడ్డో అనేది సంబంధీకులకు చెప్పేస్తారు. పైగా.. ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా ఇటీవల 8 నెలల గర్భిణికి కాన్పు చేశారు.

Road Accidents.. తెలంగాణ: వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి..

Road Accidents.. తెలంగాణ: వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి..

సంగారెడ్డి: తెలంగాణలోని వేర్వేరు జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందగా మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Crime News: తిర్మలాపూర్‌లో దారుణం.. మామతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Crime News: తిర్మలాపూర్‌లో దారుణం.. మామతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

బాన్సువాడ(Banswada) మండలం తిర్మలాపూర్‌(Tirmalapur)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త రాములును మామ నారాయణతో కలిసి భార్య మంజుల హత్య చేసింది. గొడ్డలితో దారుణంగా నరికి చంపి ఇంటి వెనక గోతిలో పాతిపెట్టారు.

Suicide: ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

Suicide: ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

కామారెడ్డి: జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. బీబీపేట మండల కేంద్రానికి చెందిన వీణ(35) అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వీణకు సిద్దిపేటకు చెందిన శ్రావణ్ కుమార్‌తో 2015లో వివాహం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి