• Home » Kaleshwaram Project

Kaleshwaram Project

Kaleshwaram Scam: హరిరామ్‌ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ

Kaleshwaram Scam: హరిరామ్‌ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ

కాలేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసులో అరెస్టు అయి చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఇంజినీరింగ్ చీఫ్ ఈఎన్‌సీ హరి రామ్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. అతనిని ఐదు రోజుల పాటు విచారించనున్నారు.

Kaleshwaram Project: కాళేశ్వరం ఈఎన్‌సీ హరిరామ్‌పై సస్పెన్షన్‌ వేటు

Kaleshwaram Project: కాళేశ్వరం ఈఎన్‌సీ హరిరామ్‌పై సస్పెన్షన్‌ వేటు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం (గజ్వేల్‌) ఈఎన్‌సీ బి.హరిరామ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులు విడుదల చేశారు.

Uttam Kumar Reddy: కాళేశ్వరం బాధ్యుల్ని వదలం

Uttam Kumar Reddy: కాళేశ్వరం బాధ్యుల్ని వదలం

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కార కులెవ రైనా వదిలిపెట్టబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అది మాజీ సీఎం కేసీఆర్‌ అయినా, మాజీ మంత్రి హరీశ్‌రావైనా, అధికారులైనా తప్పక చర్యలుంటాయన్నారు.

ACB: కాళేశ్వరం ఈఎన్‌సీ హరీరామ్‌ను కస్టడీ కోరిన ఏసీబీ..

ACB: కాళేశ్వరం ఈఎన్‌సీ హరీరామ్‌ను కస్టడీ కోరిన ఏసీబీ..

రిమాండ్‌లో ఉన్న ఈఎన్‌సీ హరీరామ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

ACB: హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

ACB: హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

ఏసీబీ అధికారులు హరీ రామ్‌ను అరెస్ట్ చేసి రీమాండ్‌కు తరలించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఆయన వ్యవహారించారు. హరీ రామ్‌ను అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. ఈ మేరకు సోమవారం కోర్టులో కస్టడీ పిటీషన్ దాఖలు చేయనున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

Kaleshwaram: బినామీల గుట్టు విప్పని హరిరామ్‌!

Kaleshwaram: బినామీల గుట్టు విప్పని హరిరామ్‌!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం ఈఎన్‌సీ భూక్యా హరిరామ్‌ కూడబెట్టిన ఆస్తుల విలువ రూ.200 కోట్ల పైమాటేనని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.

Kaleswaram Case: ఈఎన్‌సీ హరి రామ్‌కు 14 రోజుల రిమాండ్..

Kaleswaram Case: ఈఎన్‌సీ హరి రామ్‌కు 14 రోజుల రిమాండ్..

ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో ఈఎన్‌సీ హరి రామ్‌‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు సంబంధించిన 14 చోట్ల అధికారులు సోదాలు చేశారు. భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. సోదాలు ముగిసిన అనంతరం ఆదివారం తెల్లవారుజామున జడ్జి ముందు హాజరు పర్చగా విచారణ జరిపి న్యాయమూర్తి హరిరామ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు.

Kaleshwaram Project: కాళేశ్వరం ఈఎన్‌సీ.. కళ్లు చెదిరే ఆస్తి

Kaleshwaram Project: కాళేశ్వరం ఈఎన్‌సీ.. కళ్లు చెదిరే ఆస్తి

కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ(ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌) భూక్యా హరిరామ్‌ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శనివారం అరెస్టు అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల మార్పు వ్యవహారంలో భారీ స్ధాయిలో అవినీతి జరిగిందని, ఇందులో హరిరామ్‌ కీలకపాత్ర షోషించారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి.

Minister Komati Reddy: కాళేశ్వరం నాసిరకం ప్రాజెక్ట్.. కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి విసుర్లు

Minister Komati Reddy: కాళేశ్వరం నాసిరకం ప్రాజెక్ట్.. కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి విసుర్లు

Minister Komati Reddy Venkat Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం 8వ వింత అని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. మూడేళ్లలో నిర్మాణం, మూడేళ్లలో కూలిపోవడం ఎనిమిదో వింతగా కేసీఆర్ చెప్పిందే నిజం అయ్యిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.

ACB Raids: తెలంగాణలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

ACB Raids: తెలంగాణలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

ACB Raids: హైదరాబాద్‌లో ఏకకాలంలో ఏసీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర షోషించిన మాజీ ఈఎన్సీ హరీరామ్ నివాసంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి