Home » Kaleshwaram Project
EE Remand: నీటిపారుదల శాఖకు చెందిన అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నూనె శ్రీధర్‌ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
చట్టానికి ఎవరూ అతీతులు కారని, ప్రజా సొమ్మును ఇష్టారీతిన ఖర్చు చేయడం వల్లే కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరయ్యారని ఎమెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాకుండా అందులోని అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను ఇక వదిలేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలన్న నిర్ణయం అధికారులదేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్‌కు తెలిపారు. పంప్‌హౌస్ హెడ్‌కు తాకేంతవరకు నీటిని వారే నిల్వ చేశారని చెప్పారు.
KCR Kaleshwaram Inquiry: కాళేశ్వరం కమిషన్ విచారణ ముగియడంతో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కే భవన్ నుంచి వెళ్లిపోయారు. దాదాపు 50 నిమిషాల పాటు విచారణ సాగింది.
KCR Kaleshwaram Commission: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో కాళేశ్వరం కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ నిమిత్తం కేసీఆర్ బీఆర్కే భవన్‌కు చేరుకున్నారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బీఆర్కే భవన్‌లో జరుగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణకు బుధవారం హాజరయ్యారు. అయితే ఈ విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనే అంశం ఉత్కంఠగా మారింది.
కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. విజిటర్స్, పలు పనులపై బీఆర్కే భవన్‌కి వచ్చే వారిని గేట్ బయటే పోలీసులు నిలిపివేస్తున్నారు. బీఆర్కే భవన్‌లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే లోపలకు పోలీసులు అనుమతిస్తున్నారు.
తెలంగాణలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలంగాణలో ఏకకాలంలో నూనె శ్రీధర్‌కి సంబంధించి 20 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇరిగేషన్ శాఖలో ఎస్ఈగా పనిచేసిన నూనె శ్రీధర్ ఇంట్లో ఇవాళ(బుధవారం) తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌ను పక్కా ఆధారాలతో ప్రశ్నించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రకరకాల వాంగ్మూలాలు వచ్చిన నేపథ్యంలో ఆధారాలన్నింటినీ ముందు పెట్టి మరీ కేసీఆర్‌ను విచారించనున్నట్లు తెలిసింది.