Home » Kadapa Dargah
జాతీ య రహదారి అంటే రోడ్డుకు ఇరువైపులా కంటికి ఇంపుగా కనిపించాలి. ఇందుకు గాను నేషనల్ హైవే అథార్టీ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తుంది. కనీసం పట్టణం గుండా వెళ్లే రహ దారైనా చక్కగా ఉంచాల్సిన బాధ్యత మనది. ఈ రోడ్డు మనది కాదని ఆర్‌అండ్‌బీ, పట్టణ పాలక కమిటీ బాధ్యత మరిచింది. జాతీయ రహదారి అధి కారులు గాలికి వదిలేయడంతో జాతీయ రహదారికి ఇరువైపులా మట్టి పేరుకు పోయి ఉంది. అంతే కాకుండా రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడం, తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేయడం పరిపాటైంది.