Share News

జాతీయ రహదారేనా...!

ABN , Publish Date - Sep 10 , 2025 | 10:46 PM

జాతీ య రహదారి అంటే రోడ్డుకు ఇరువైపులా కంటికి ఇంపుగా కనిపించాలి. ఇందుకు గాను నేషనల్‌ హైవే అథార్టీ ఆఫ్‌ ఇండియా ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తుంది. కనీసం పట్టణం గుండా వెళ్లే రహ దారైనా చక్కగా ఉంచాల్సిన బాధ్యత మనది. ఈ రోడ్డు మనది కాదని ఆర్‌అండ్‌బీ, పట్టణ పాలక కమిటీ బాధ్యత మరిచింది. జాతీయ రహదారి అధి కారులు గాలికి వదిలేయడంతో జాతీయ రహదారికి ఇరువైపులా మట్టి పేరుకు పోయి ఉంది. అంతే కాకుండా రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడం, తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేయడం పరిపాటైంది.

జాతీయ రహదారేనా...!
మార్కెట్‌ యార్డు సమీప జాతీయ రహదారికి ఇరువైపులా రోడ్డుపై పేరుకుపోయిన మట్టి

రోడ్డుకు ఇరువైపులా భారీగా పేరుకుపోయిన మట్టి

తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, స్థానికులు

ములకలచెరువు, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): జాతీ య రహదారి అంటే రోడ్డుకు ఇరువైపులా కంటికి ఇంపుగా కనిపించాలి. ఇందుకు గాను నేషనల్‌ హైవే అథార్టీ ఆఫ్‌ ఇండియా ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తుంది. కనీసం పట్టణం గుండా వెళ్లే రహ దారైనా చక్కగా ఉంచాల్సిన బాధ్యత మనది. ఈ రోడ్డు మనది కాదని ఆర్‌అండ్‌బీ, పట్టణ పాలక కమిటీ బాధ్యత మరిచింది. జాతీయ రహదారి అధి కారులు గాలికి వదిలేయడంతో జాతీయ రహదారికి ఇరువైపులా మట్టి పేరుకు పోయి ఉంది. అంతే కాకుండా రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడం, తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేయడం పరిపాటైంది. ముం బై - చెన్నై జాతీయ రహదారికి ఇరువైపులా భారీగా మట్టి పేరుకుపోయింది. అసలు ఇది జాతీయ రహ దారేనా అనే అనుమానం కలుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు మార్కెట్‌ యార్డు నుంచి మట్టి కొట్టుకొచ్చి రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయింది. స్థానిక పెట్రోల్‌ బంకు నుంచి ఆర్టీసీ బస్టాండు, మా ర్కెట్‌ యార్డు, బస్టాండు సర్కిల్‌ నుంచి షాదీమహ ల్‌ వరకు సుమారు రెండు కిలో మీటర్లకుపైగా రోడ్డు ఇరువైపులా మట్టితో నిండిపోయింది.


7MPL-MCU2.gifబస్టాండు సర్కిల్‌ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా...

రోడ్డే కన్పించకుండా పోయింది. వాహనాల రాకపోకలు సాగించే సమయంలో మట్టి భారీగా లేస్తుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పాదచారులు వెళ్లలేకపోతున్నారు. సంబంధిత అధి కారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా భారీగా నిల్వ ఉన్న మట్టిని తొలగించాలని వాహనదారులు, స్ధానికులు అధికారులను కోరుతున్నారు.

Updated Date - Sep 10 , 2025 | 10:49 PM