Home » Jupally Krishna Rao
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మిస్‌వరల్డ్ పోటీలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం గర్వకారణమని మంత్రి జూపల్లి తెలిపారు. ఈ పోటీలు రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి తోడ్పడతాయని, ప్రపంచానికి మన సంస్కృతిని చాటే వేదికవుతాయని అన్నారు.
Jupally On Miss World Event: మిస్ వరల్డ్ పోటీలు ఏ కోణంలో చూస్తే అలా కనిపిస్తాయని.. ఈ ఈవెంట్‌కు వందల కోట్లు ఖర్చుపెట్టడం లేదని మంత్రి జూపల్లి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.5 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోందన్నారు.
కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని విలన్‌గా చూపించాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు
తెలంగాణలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ముంబైలో జరిగిన హోటల్స్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులో తెలంగాణ ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత హోటల్స్, ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు
బీజేపీ, బీఆర్‌ఎస్ నేతల మాటలకు బోల్తా పడొద్దని విద్యార్థులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వారు రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో ఇకపై డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం అనుసరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
Minister Jupally Krishna Rao: మిస్ వరల్డ్ పోటీల ద్వారా నిరంతరంగా పర్యాటక రంగానికి సంబంధించి రాబడి పెరుగుతుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ పోటీలతో ప్రపంచ పర్యాటకులను ఆకర్షించగలమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆదాయం పెంచుకోవడంతో పాటు పర్యాటక రంగంలో యువతకు భారీగా ఉపాధి కల్పించే నిర్ణయాలు తీసుకోనున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులు చేయలేద ని నిరూపిస్తే తాను మంత్రి పదవి సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తానని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ చేశారు. శాసన మండలిలో ప్రత్యేక ప్రస్తావన కింద బీఆర్‌ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానం చెప్పారు.