Home » Jubilee Hills By-Election
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటితో ఎన్నికల ప్రచారం ముగియడంతో.. నియోజకవర్గం వ్యాప్తంగా అధికారులు అప్రమత్తం అయ్యారు.
నేటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగియడంతో.. అధికారులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఓటింగ్ జరుగుతుండటంతో ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమరం ముగింపు దశకు చేరింది. మంగళవారం జరిగే పోలింగ్‌పై ఇన్‌చార్జీలు, స్థానికంగా ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్ రోజున పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేలా..
కేటీఆర్‌తో కలిసి గోపీనాథ్ ఆస్తుల్లో వాటాకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. అందుకే గోపీనాథ్ మరణం మిస్టరీపై, ఆస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించడం లేదని విమర్శించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. ఈరోజుతో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జోరుగా ఇవాళ ప్రచారం చేయనున్నాయి.
మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి పోలీసులను ఆశ్రయించారు. తన కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ మరణంపై దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ పలు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. మద్యం షాపులని నిబంధనల మేరకు బంద్ చేయాలని ఆదేశించారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
బీజేపీతో ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయట ఉన్నారని ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఓటు చోరీపై ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. యూపీ వంటి ఇతర రాష్ట్రాల వారికి కూడా హర్యానాలో ఓట్లు ఉన్నాయని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్.