Home » JP Nadda
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాష్ట్రంలో 8 మంది ఎంపీ అభ్యర్థుల ఎంపికపై జాబితాను అధిష్టానానికి అందజేశారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో శనివారం రాత్రి చర్చలు జరిపిన కిషన్ రెడ్డి.. 8 లోక్ సభ స్థానాల అభ్యర్ధుల లిస్టును అమిత్ షాకు ఇచ్చారు.
TDP Joins In NDA: తెలుగుదేశం పార్టీతో (Telugu Desam) పొత్తుపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. మూడ్రోజుల పాటు ఢిల్లీ వేదికగా బీజేపీ అగ్రనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చర్చల అనంతరం పొత్తుపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఓ లెటర్ రూపంలో అధికారిక ప్రకటన చేశారు. ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
AP Elections 2024: అవును.. అనుకున్నట్లే ఎన్డీఏలోకి టీడీపీ చేరిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మూడ్రోజులు పాటు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ జరిపిన కీలక చర్చలు సక్సెస్ అయ్యాయి. ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక ప్రకటనే చేశారు. పర్యటన అనంతరం టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీ వేదికగా ఏం జరిగింది..? బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తున్నామనే విషయాలపై చర్చించడం జరిగింది.
Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) కీలక పరిణామమే చోటుచేసుకుంది. టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమిలో బీజేపీ (BJP) వచ్చి చేరింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మూడ్రోజులుగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి...