Home » JNTU
జేఎన్టీయూ ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాసూటికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఓటీపీఆర్‌ఐ) నూతన శోభను సంతరించుకోనుంది. విద్యార్థులను వేధిస్తున్న భవనాల కొరత త్వరలోనే తీరనుంది. క్యాంప్‌సలోనే బాల, బాలికలకు ప్రత్యేకంగా హాస్టల్ భవనాలను యాజమాన్యం నిర్మిస్తోంది. వీటితోపాటు అకడమిక్, అడ్మినిస్ర్టేషన ...
జేఎన్‌టీయూలో శనివారం నిర్వహించిన మెగా జాబ్‌ఫెయిర్‌కు నిరుద్యోగులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా నిరుద్యోగులురావడంతో వర్సిటీ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై జేఎన్‌టీయూ మరింత దృష్టి సారించింది. ఇప్పటికే సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ కాలేజీలో సోలార్ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటుతో విద్యుత్ చార్జీలు గణనీయంగా ఆదా అవుతుండగా, త్వరలో హైదరాబాద్ క్యాంప్‌సలోని హాస్టళ్ల నుంచి వచ్చే కిచెన్ వ్యర్థాలతో బయోగ్యాస్‌ని ఉత్పత్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మార్చి 1న జేఎన్‌టీయూలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ టి.కిషన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
జేఎన్టీయూ(JNTU)కు, వర్సిటీకి అనుబంధంగా ఉన్న 8 కళాశాలలకు ప్రతినెలా రెండవ శనివారంతో పాటు 4వ శనివారాన్ని కూడా సెలవుదినంగా ప్రకటించాలని కొత్త వీసీని సిబ్బంది కోరారు.
జేఎన్టీయూ నూతన ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే డా. కిషన్‌కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో పనిదినాలను వారానికి ఆరు రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గించాలని నిర్ణయించారు.
గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం ఎట్టకేలకు మెట్టు దిగింది. ప్రభుత్వ నిబంధనలు, వర్సిటీ ఆదేశాలను బేఖాతరు చేసిన కారణంగా గోకరాజు కాలేజీ యాజమాన్యంపై జేఎన్‌టీయూ అధికారులు కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వర్సిటీ అఫిలియేటెడ్, అటానమస్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కళాశాలలపై కొరడా ఝళిపించేందుకు జేఎన్‌టీయూ సన్నద్ధమైంది.
జేఎన్టీయూ(JNTU)లో పలువురు అధికారులు, ఆచార్యులను బదిలీ చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎం.పద్మావతిని బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీయల్ కన్సల్టెన్సీ సర్వీసెస్(బిక్స్) డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు.
జేఎన్టీయూ(JNTU)కు కొత్త వైస్‌చాన్స్‌లర్ నియామకం మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. గతేడాది మే 21న ఖాళీ అయిన వర్సిటీ వీసీ పోస్టును భర్తీ చేసేందుకు ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించినా సాంకేతిక కారణాల రీత్యా నియామక ప్రక్రియ రెండుసార్లు వాయిదా పడింది.