• Home » JDU

JDU

Election Commission: లోక్‌సభ ఎన్నికల్లో 65.79% పోలింగ్‌

Election Commission: లోక్‌సభ ఎన్నికల్లో 65.79% పోలింగ్‌

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదయింది. 18వ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు మినహా ఈవీఎంల్లో 65.79 శాతం మేర పోలింగ్‌ జరిగినట్లు గురువారం సీఈసీ రాజీవ్‌ కుమార్‌ వివరించారు.

 Kishan Chand Tyagi : అగ్నిపథ్‌ను  సమీక్షించాలి

Kishan Chand Tyagi : అగ్నిపథ్‌ను సమీక్షించాలి

కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీకి అగ్నిపథ్‌ అంశం తలనొప్పిగా మారేలా ఉంది. సొంతంగా మెజార్టీ దక్కకపోవడంతో టీడీపీ, బిహార్‌లోని జేడీయూ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. ఇలాంటి కీలక తరుణంలో జేడీయూ తన తొలి డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది.

NDA: మోదీకి కొత్త తలనొప్పి.. కీలక శాఖలపై జేడీయూ కన్ను..

NDA: మోదీకి కొత్త తలనొప్పి.. కీలక శాఖలపై జేడీయూ కన్ను..

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో బిహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూ, ఏపీలో త్వరలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్న టీడీపీ మద్దతు బీజేపీకి(BJP) తప్పనిసరి. మిత్ర పక్షాల మద్దతు కావాలంటే వారు కోరిన పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Chandrababu: చంద్రబాబు పవర్ ‘సెంటర్‌’ పాలిటిక్స్!

Chandrababu: చంద్రబాబు పవర్ ‘సెంటర్‌’ పాలిటిక్స్!

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి దేశ రాజధాని హస్తిన వేదికగా చక్రం తిప్పబోతున్నారా? అంటే తాజా పరిణామాల నేపథ్యంలో అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్డీయే కూటమి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

NDA Alliance: అందరి చూపు వారివైపే.. కింగ్ మేకర్లుగా బాబు, నితీశ్

NDA Alliance: అందరి చూపు వారివైపే.. కింగ్ మేకర్లుగా బాబు, నితీశ్

సార్వత్రిక సమరం ముగిసింది అనుకుంటున్న వేళ మరో సమరం తెరపైకి వచ్చింది. అదే.. బీజేపీ సొంతంగా మెజారిటీ మార్క్ చేరకపోవడం. ప్రధాని మోదీ చరిష్మా మరోసారి మ్యాజిక్ చేస్తుందనుకున్న బీజేపీ నేతలకు ఇది మింగుడుపడటం లేదు.

NDA: ఎన్డీఏ సమావేశానికి హాజరుకానున్న నితీష్.. ప్రభుత్వ ఏర్పాటుపై కీలక చర్చలు!

NDA: ఎన్డీఏ సమావేశానికి హాజరుకానున్న నితీష్.. ప్రభుత్వ ఏర్పాటుపై కీలక చర్చలు!

బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్(Nitish Kumar) బుధవారం ఢిల్లీలో జరగనున్న ఎన్‌డీఏ సమావేశంలో పాల్గొంటారని వార్తా సంస్థ పీటీఐ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 40 సీట్లలో 12 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకున్న జేడీయూ ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు.

Who is The PM fo India: దేశ తదుపరి ప్రధాని ఎవరు? మోదీకి ఛాన్స్ ఇస్తారా?

Who is The PM fo India: దేశ తదుపరి ప్రధాని ఎవరు? మోదీకి ఛాన్స్ ఇస్తారా?

Prime Minister Of India: దేశ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలూ వచ్చేశాయి.. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఓటర్లు. ఎవరికీ పూర్తిస్థాయి మెజార్టీ ఇవ్వకపోవడంతో.. మళ్లీ సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో అసలు చర్చ ఇప్పుడే ప్రారంభమైంది. ఇంతకాలం మోదీ 3.0 సర్కార్ వస్తుందని అంతా అనుకున్నా.. సీన్ రివర్స్ అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ ఎగబడి ఎగబడి.. మోదీ నామం జపించినా..

మోదీ  సీఎం కాబోతున్నారు: నితీశ్‌

మోదీ సీఎం కాబోతున్నారు: నితీశ్‌

మోదీ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నోరుజారారు.

Lok Sabha Polls: ఎన్డీయేకు ఓటు వేయాలంటున్న ఇండియా కూటమి.. పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!

Lok Sabha Polls: ఎన్డీయేకు ఓటు వేయాలంటున్న ఇండియా కూటమి.. పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏడు విడతల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ ముగిసింది. రెండో విడత పోలింగ్ ఈనెల 26వ తేదీన జరగనుంది. బీహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానానికి రెండో విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. బీహార్‌లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి అభ్యర్థుల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. ఒక పూర్నియా స్థానంలో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పప్పు యాదవ్ పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.

Lok Sabha Elections: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాక్..!

Lok Sabha Elections: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాక్..!

రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Comission) షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి