Home » Jammu and Kashmir
Chenab Railway Bridge: యావత్ దేశాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ తొలిసారి జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చీనాబ్ బ్రిడ్జితో పాటు మరో రైలు బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభించారు.
సైనికులకు బాసటగా రాహుల్‌గాంధీ నిలిస్తే విమర్శలు చేయడం బీజేపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అపర ఖాళీ మాత ఇందిరా గాంధీ అని వాజ్‌పాయ్ కొనియాడిన విషయం కిషన్‌రెడ్డికి తెలవకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
పూంచ్ పౌరులు, అధికారులు చూపించిన సాహసం, దేశభక్తి యవద్దేశానికి స్ఫూర్తినిస్తుందని అమిత్‌షా ప్రశంసించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పిరికిపందల చర్య అని, ఏ ఒక్క ఉగ్రవాద చర్యను ఉపేక్షించరాదన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధాన నిర్ణయమని చెప్పారు.
పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పే విషయంలో కేంద్రానికి సహకరించామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యుద్ధం అంటే ధైర్యం, వెన్నెముక, యుద్ధతంత్రం ఉండాలని తెలిపారు. నాలుగు రోజుల యుద్ధం తర్వాత అర్ధాంతరంగా యుద్ధం ఎందుకు ఆపేశారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
Amit Shah: రెండు రోజుల జమ్మూ కశ్మీర్ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం వెళ్లనున్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆయన స్వయంగా పరామర్శించనున్నారు.
భారత సాయుధ బలగాలు పాకిస్థాన్‌లోని 2.2 కిలోమీటర్ల లోపలకు చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరపడం, అత్యంత శక్తివంతంగా దాడులు జరగడంతో పాకిస్థాన్ రేంజర్లు కకావికలై పరుగులు తీయడం ఈ వీడియోలో కనిపిస్తోంది.
కశ్మీర్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రంగంపై పహల్గాం ఉగ్రదాడి ప్రభావం తీవ్రంగా పడిందని, ఈ నేపథ్యంలో పర్యాటకంపై ఆధారపడిన ప్రజలకు సంఘీభావంగా క్యాబినెట్ సమావేశాన్ని పహల్గాంలో ఏర్పాటు చేశామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
రాజస్థాన్ కోటాలో నీట్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మరో 18 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సూసైడ్ (NEET Aspirant Suicide) చేసుకోవడానికి కొన్ని సెకన్ల ముందు ఒక అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడింది. అయితే అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూకశ్మీర్ పూంచ్‌లో (Rahul Gandhi Poonch Visit) ప్రాణాలు కోల్పోయిన పలువురి కుటుంబాలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పరామర్శించి మానవీయతను చాటుకున్నారు. పాకిస్థాన్ షెల్లింగ్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు.
జమ్మూ కశ్మీర్ కిష్త్వార్‌లో (Jammu Kashmir Encounter) నేడు (మే 23, 2025న) కూడా ఉగ్రవాదులతో రెండోరోజు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఓ జవాన్ వీర మరణం చెందారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు రహస్యంగా వచ్చారనే సమాచారం తెలుసుకుని, భారత సైన్యం రంగంలోకి దిగింది.