• Home » Jaipur

Jaipur

 Rajasthan CM: రాజస్థాన్ ముఖ్యమంత్రిని చంపుతామని బెదిరింపులు, ముగ్గురి అరెస్ట్

Rajasthan CM: రాజస్థాన్ ముఖ్యమంత్రిని చంపుతామని బెదిరింపులు, ముగ్గురి అరెస్ట్

రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మను చంపుతామని బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బెదిరింపు కాల్ చేసిన లోకేషన్‌ను ట్రేస్ చేశారు. జైపూర్ సెంట్రల్ జైలు నుంచి ఫోన్ వచ్చినట్టు గుర్తించారు.

BJP: మంత్రి పదవి చేపట్టిన 10 రోజుల్లోనే రాజీనామా

BJP: మంత్రి పదవి చేపట్టిన 10 రోజుల్లోనే రాజీనామా

రాజస్థాన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న బీజేపీ సీనియర్ నేత సురేంద్ర పాల్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవి దక్కి సరిగ్గా 10 రోజులు కూడా గడవకముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. సోమవారం వెలువడిన కరణ్‌పూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన ఓటమిపాలయ్యారు.

New Ministers Sworn: నేడు 18 నుంచి 20 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం

New Ministers Sworn: నేడు 18 నుంచి 20 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం

నేడు రాజస్థాన్‌లో మంత్రి విస్తరణ జరగనుంది. సీఎం భజన్ లాల్ శర్మ మంత్రి వర్గంలోని కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా నూతన మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు.

Viral Video: యువతిపై కామెంట్.. కారుతో తొక్కేసిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో

Viral Video: యువతిపై కామెంట్.. కారుతో తొక్కేసిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో

పబ్‌లో మొదలైన చిన్న గొడవ చివరకు యువతి ప్రాణం తీసింది. మద్యం మత్తులో ఓ యువకుడు మరో యువతిపై కామెంట్ చేశాడు. దీంతో యువతీయువకుల మధ్య గొడవ మొదలైంది. చివరకు..

Karni Sena Chief Murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

Karni Sena Chief Murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అర్ధరాత్రి ఛండీగఢ్‌లో హత్యలో పాల్గొన్న ఇద్దరు షూటర్లు, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Gogamedi Murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో తొలి అరెస్టు

Gogamedi Murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో తొలి అరెస్టు

రాజస్థాన్‌ లో సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది రుణ హత్య కేసులో శనివారంనాడు తొలి అరెస్టు చోటుచేసుకుంది. గోగమేదిపై కాల్పులు జరిపిన షూటర్లు రోహిత్, నితిన్‌ వెంటనే అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యేందుకు సహకరించిన రామ్‌వీర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Karni Sena Chief Murder: కర్ణి సేన చీఫ్ హత్య కేసులో కీలక పరిణామం.. ఇద్దరు పోలీసులపై వేటు

Karni Sena Chief Murder: కర్ణి సేన చీఫ్ హత్య కేసులో కీలక పరిణామం.. ఇద్దరు పోలీసులపై వేటు

రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

Rajasthan: రాజ్‌పుత్ కర్ణి సేన హత్యకు నిరసనగా నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపు

Rajasthan: రాజ్‌పుత్ కర్ణి సేన హత్యకు నిరసనగా నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపు

తమ అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు నిరసనగా నేడు రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన, ఇతర కమ్యూనిటీ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో నేడు రాజస్థాన్ వ్యాప్తంగా బంద్ వాతావరణం ఉంది.

Jaipur: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్నిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్‌‌ను కాల్చిచంపిన దుండగులు

Jaipur: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్నిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్‌‌ను కాల్చిచంపిన దుండగులు

రాజస్థాన్‌లోని జైపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ని సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామోడీ ని దుండగులు కాల్చిచంపారు. దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి ఆయనపై కాల్పులు జరిపినట్టు ప్రాథమిక సమాచారం.

Sonia Gandhi: జైపూర్‌కు తాత్కాలికంగా మకాం మార్చిన సోనియా.. ఎందుకంటే..?

Sonia Gandhi: జైపూర్‌కు తాత్కాలికంగా మకాం మార్చిన సోనియా.. ఎందుకంటే..?

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రం కావడం, ఉదయమైతే విషపూరిత పొగమంచు కమ్మేస్తుండటంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అప్రమత్తమయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె వైద్యుల సలహా మేరకు జైపూర్‌కు తాత్కాలికంగా మకాం మార్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి