Home » Jagtial
కార్మిక వ్యతిరేకంగా ఉన్న 4 లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం అన్ని కార్మిక సంఘాల జిల్లా సదస్సు నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యం రావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కడారి సునీల్, ఐఎన్‌టీయుసీ బూమల్ల చందర్, ఐఎఫ్‌టీయు నాయకులు కె. విశ్వ నాథ్, సిహెచ్ శంకర్, వైకుంఠం మాట్లాడారు.
జిల్లాలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికా రులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యాల, నియంత్రణ చర్యలపై అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు.
నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ నేతలకు నిరీక్షణ తప్పడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చి యేడాదిన్నర అవుతున్నా నామినేటెడ్ పదవుల నియామకంలో ఇంకా కొన్ని అవకాశాలను భర్తీ చేయడం లేదు. ప్రధానంగా జిల్లా, నియోజకవర్గ స్థాయి పలు పదవులతో పాటు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఆలయాల చైర్మన్ల పదవులపై కన్నేసిన నాయకులు నిర్విరామంగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తునే ఉన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 జిల్లా రవాణాశాఖ ఖజానా గలగల లాడింది. రూ.39.25 కోట్ల ఆదాయం సమకూరింది. 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే 2024-25 అర్థిక సంవత్సరం రూ.1.55 కోట్లు అదనంగా ఆదాయం సమకూరింది. 2022 -23 అర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ. 33.08 కోట్ల ఆదాయం వచ్చింది.
రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు ఈ నెల 14వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించిన ప్రభుత్వం ఇక నుంచి మీసేవ కేంద్రాల్లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా నేరుగా దరఖాస్తులు ఇచ్చేందుకు అవకాశం కల్పించింది.
మొక్కజొన్న రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో చేతికి వచ్చిన పంటను దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. వరదలతో వానాకాలంలో చాలా మంది మొక్కజొన్న రైతులు నష్టపోయారు. కొన్ని చోట్ల రైతులకు పెట్టుబడి కూడా దక్కలేదు.
సీతారా ముల కల్యాణోత్సవం ఆదివారం గోదావరిఖని కోదండ రామాలయంలో అంగరంగవైభవంగా జరి గింది. మినీ భద్రాచలంగా పేరొందిన కోదండ రామాలయం ఆవరణలో కల్యాణ వేదికపై వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యా ణాన్ని వేలాది మంది భక్తజనం కన్నులారా వీక్షిం చి తరించారు.
దేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడమే బీజేపీ ముఖ్య ఉద్దేశ్యమని మాజీ ఎమ్మెల్యే గు జ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జెండాను ఎగురవేశారు.
కార్మిక ఉద్యమ నిర్మాత, సీఐటీ యూ వ్యవస్థాపక అధ్యక్షుడు బిటి రణదీవే వర్ధంతిని ఆదివారం సీఐటీయూ ఆఫీసు శ్రామికభవన్‌లో నిర్వహించారు. రణదీవే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ’సామాజిక న్యాయం- సీఐటీయూ అవగాహన’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేదవాడికి 5 కిలోల సన్నబియ్యం అందజేస్తుందని బీజేపీ రామగుండం ఇంచార్జీ కందుల సంధ్యారాణి అన్నారు. ఆదివారం గోదావరిఖనిలోని పలు రేషన్ షాపులను బీజేపీ నాయకులు సందర్శించి రేషన్ షాపు ఎదుట మోదీ చిత్రపటం పెఆ్టలని డీలర్లను డిమాండ్ చేశారు.