• Home » Jagtial

Jagtial

ప్రజల వద్దకు పోలీసులు

ప్రజల వద్దకు పోలీసులు

ప్రజలకు పోలీసులు దగ్గరవ్వాలని, ఎక్కడ సమస్యలుంటే అక్కడికి వెళ్లి పరిష్కరించాలని డీజీపీ జితేందర్‌ పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. ఈ మేరకు సీపీ గౌస్‌ ఆలం ఆధ్వర్యంలో పోలీస్‌ కమిషనరేట్‌ వ్యాప్తంగా విజిబుల్‌ పోలీసింగ్‌ను పకడ్భందీగా అమలు చేస్తున్నారు.

జిల్లాను హెల్త్‌ కేర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం

జిల్లాను హెల్త్‌ కేర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం

జిల్లాను హెల్త్‌ కేర్‌ హబ్‌గా తీర్చి దిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో మెడికల్‌ అండ్‌ హెల్త్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, జనరల్‌ ఆసుపత్రి పరిధిలో ఉన్న ఆసుపత్రుల బలోపేతంపై ఆయా విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

వాణిజ్య కేంద్రంగా ఫూలే పార్కు

వాణిజ్య కేంద్రంగా ఫూలే పార్కు

అహ్లాదంతో పాటు వాకింగ్‌ ట్రాక్‌తో ఆరోగ్యాన్ని అందించాలని నగరంలోని ఏర్పాటు చేసిన జ్యోతిబాపూలే పార్కును వాణిజ్య కేంద్రంగా మార్చుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా క్రీడా మైదానంగా ఉన్న జ్యోతిబాపూలే మైదానాన్ని స్మార్ట్‌ సిటీలో భాగంగా ఆరు కోట్ల రూపాయల నిధులతో ఆధునీకరించారు. అందులోనే వాకింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు.

ఆరుతడి పంటలు అంతంతమాత్రమే..!

ఆరుతడి పంటలు అంతంతమాత్రమే..!

జిల్లాలో ఆరు తడి పంటలకు ఆదరణ కరువవుతోంది. ఏడాదికేడాది వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మొత్తం పంటల సాగులో 75 శాతానికి పైగా వరి ఉండడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. వరి సాగు కారణంగా విద్యుత్‌ వినియోగం పెరగడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిర్మించారు.. నిర్లక్ష్యంగా వదిలేశారు

నిర్మించారు.. నిర్లక్ష్యంగా వదిలేశారు

నిరుపేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఇళ్ల నిర్మాణం పూర్తయి ఆరేళ్లు గడిచిపోయినా పేదలకు కేటాయించడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం చూపడంతో ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.

ఫలించిన నిరీక్షణ

ఫలించిన నిరీక్షణ

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న సెర్ప్‌(సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ) ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈమేరకు జీవో నంబరు 250ను ప్రభుత్వ కార్యదర్శి డీఎస్‌ లోకేష్‌ కుమార్‌ జారీ చేశారు.

తవ్వి.. వదిలేశారు

తవ్వి.. వదిలేశారు

ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటిగా అభివృద్ధి పరచడమే కాకుండా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి హామీ పద్దు కింద చేపట్టిన పనులకే మోక్షం లేకుండా పోయి వెక్కిరిస్తున్నాయి.

సెక్రెటరీలు కావలెను

సెక్రెటరీలు కావలెను

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయాల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. రైతులు పండించిన ఉత్పత్తులను సేకరించే వ్యవసాయ మార్కెట్లపై పర్యవేక్షణ కొరవడింది. జిల్లాలోని ప్రధాన మార్కెట్లు సైతం ఇన్‌చార్జీల పాలనలో కొనసాగుతున్నాయి. ఒక్కో సెక్రెటరీకి మూడు, నాలుగు మార్కెట్ల బాధ్యతలు అప్పగించడంతో పని ఒత్తిడితో సతమతం అవుతున్నారు.

భూభారతి చట్టంపై విస్తృత ప్రచారం కల్పించాలి

భూభారతి చట్టంపై విస్తృత ప్రచారం కల్పించాలి

భూ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి ఆర్వోఆర్‌ చట్టంపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో భూ భారతి చట్టం అమలుపై అదనపు కలెక్టర్‌ డి వేణు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 కాంగ్రెస్‌ పార్టీలో మంత్రి పదవుల కోసం కొట్లాట

కాంగ్రెస్‌ పార్టీలో మంత్రి పదవుల కోసం కొట్లాట

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితిలో ఉందని, ఆ పార్టీలో మంత్రి పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ నిజామాబాద్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. తెలంగాణాలో రాబోయేదీ బీజేపీ ప్రభుత్వమే నని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నా రు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి