Home » Jagtial
ఉగాది పండుగ పూట పిల్ల లను కలిసేందుకు తల్లిదండ్రులు పడిగాపులు కాశారు. స్థానిక రమేష్ నగర్‌లోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాల(గుంజపడుగు) వద్ద ఆదివారం పిల్లలను కలిసేందుకు తల్లిదండ్రులు వచ్చారు.
సాగునీటి కాలువలను పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని, ఎస్సారెస్పీ కాలువలను ధ్వంసం చేస్తే ఎవరినీ ఉపేక్షిం చేది లేదని ఎమ్మెల్యే విజయరమణారావు హెచ్చరిం చారు. సుల్తానాబాద్ సహకార సంఘం సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది.
మున్సిపల్ ఆదాయాన్ని పెంచుకొని పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మం గళవారం కలెక్టరేట్‌లో రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల బడ్జెట్ తయారీపై అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సమీక్ష నిర్వహించారు.
క్షయ వ్యాధికి గురి కాకుండా జగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో అన్నా ప్రసన్న కుమారి సూచించారు. క్షయ వ్యాది నివారణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రధాన ఆసుపత్రి నుంచి అమర్ చంద్ కల్యాణమండపం వరకు ర్యాలీ నిర్వహించారు.
సిరిసిల్ల ఆర్థిక అవనిపై అతివలు ఆదర్శంగా నిలుస్తున్నారు. కుటుంబ వ్యవహారాల్లోనే కాదు పరుషులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో చట్టసభల్లో అడుగుపెడుతున్నారు. అంతేకాకుండా వ్యాపార రంగాల్లో శక్తివంచన లేకుండా విజయభేరి మోగిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వడ్డీలేని రుణాలతో ముందడుగు వేస్తున్నారు.
ఇంటి స్థలం ఉన్న నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆరంభంలోనే జాప్యమవుతున్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన అధికారులు అర్హులైన 1,409 మందికి ఇళ్లను మంజూరు చేశారు.
ప్రయాణికులకు మెరుగైన సౌక ర్యాల కల్పనే రైల్వే సంస్థ ప్రధాన లక్ష్యమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. శుక్రవారం రామగుండం రైల్వే స్టేషన్‌ను సందర్శించి మాట్లాడారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు లో వచ్చిన జీఎంకు స్థానిక రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు.
రోడ్డు ప్రమాదాల నుం చి ప్రజలను కాపాడడమే ప్రధాన లక్ష్యమని సీపీ అంబర్ కిశోర్ ఝా చెప్పారు. శుక్రవారం కమిషనరేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల రోడ్ సేఫ్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రామగుండం కమిషరేట్ పరిధిలో ట్రాఫిక్, రోడ్ సేఫ్టీపై నమ్మకం, భరోసా కలగాలన్నారు.
ఎల్‌ఆర్ ఎస్ దరఖాస్తులను నెలాఖరులోగా పూర్తిగా పరిష్కరించాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రధా న కార్యదర్శి ఎం దానకిషోర్ అన్నారు. శుక్ర వారం కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్ రుసుం చెల్లించిన అభ్యర్థులకు క్రమబద్ధీకరణ మంజూరు పత్రాలు వెంటనే అందేలా చర్య లు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 12,30వరకు జరిగే పరీక్షలను ప్రశాం తంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో పరీక్ష రాసే 7,393మంది విద్యార్థుల కోసం 41పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు.