Home » Jaggareddy
బీజేపీ ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలపై తూర్పు జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీపై విమర్శలు చేయాల్సిన పరిస్థితిని రఘునందన్ తెచ్చారని ధ్వజమెత్తారు.
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డితో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డిలు సోమవారం భేటీ అయ్యారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ నాయకత్వంలో.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సామాజిక ప్రజాపాలన చేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనపై చర్చకు సిద్ధమా.. కిషన్ రెడ్డీ అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడి సవాలు విసిరారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కులగణనకు రాహుల్ గాంధీనే దేశ హీరో అని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం నిర్ణయం ప్రశంసనీయం అయినా, కులగణన క్రెడిట్ మాత్రం రాహుల్‌కే చెందుతుందని అన్నారు.
బీజేపీ.. ఆ పార్టీ పుట్టకముందున్న ఆర్‌ఎస్ఎస్‌లు రాహుల్ గాంధీ కుటుంబానికి బద్ధ శత్రువులన్న కనీస జ్ఞానం.. హరీశ్ రావుకు లేదా అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీకీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీకీ చాలా తేడా ఉందన్నారు. రుణమాఫీ చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డికి ఐదేళ్ల సమయం ఉన్నా, ఆయన సాగదీయలేదన్నారు.
రాహుల్ గాంధీపై కేసీఆర్ అనవసరంగా మాట తూలారని, వాస్తవానికి తెలంగాణ ఇచ్చేయాలంటూ రాహుల్ గాంధీ చెప్పిన తర్వాతనే ప్రక్రియ మొదలైందని చెప్పారు.
Jagga Reddy Counter To KCR: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీఆర్ఎస్ అధినేత KCRపై మండిపడ్డారు. ‘ ఈ వయసులో దిగజారుడు రాజకీయాలు కేసీఆర్‌కు అవసరమా?.. ఇంత అనుభవమున్న కేసీఆర్ ఎందుకు టెంప్ట్ అవుతున్నారు. కేసీఆర్ ఎన్ని రాష్ట్రాలకు ఎన్ని సంచులు మోసాడో తెలియదా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డిలో జరిగిన వేడుకకు పలువురు ప్రముఖ నాయకులు హాజరయ్యారు.