Home » Jagdeep Dhankar
ప్రజాస్వామ్యంలో పాలన చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమేనని, కోర్టులు పాలనలో జోక్యం చేసుకోకూడదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. పార్లమెంటుకు, ప్రజలకు ప్రభుత్వమే జవాబుదారి అని రాజ్యసభలో నిర్వహించిన చర్చలో స్పష్టం చేశారు
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వ్యవహారంపై ధన్‌ఖడ్ మాట్లాడుతూ, ఇది కచ్చితంగా చాలా తీవ్రమైన అంశమని అన్నారు. దీనిపై కార్యచరణకు సంబంధించి ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేయమని ఖర్గే సూచించగా, జేపీ నడ్డా అంగీకరించినట్టు తెలిపారు.
Vice President : గుండెపోటు కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చికిత్స తర్వాత క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుండటంతో ఇవాళ డిశ్చార్జి చేశారు. ఎయిమ్స్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం రాబోయే కొద్దిరోజులు..
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.ఛాతీలో నొప్పి, అసౌకర్యం ఉండడంతో ఆయనను ఆదివారం తెల్లవారు జామున ఎయిమ్స్‌లో చేర్పించారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) ఆవిష్కరణలకు కేంద్ర బిందు వు కావాలని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పిలుపునిచ్చారు.
మెదక్ జిల్లాలో 655 మంది రైతులు సేంద్రియ సేద్యం చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చెప్పారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ ఎరువులతో పంటలు పండించిన రైతులతో సమ్మేళనం నిర్వహించారు.
భావవ్యక్తీకరణ అనేది ప్రజాస్వామానికి నిర్వచనమని, అయితే అర్హమైన విధంగా భావ వ్యక్తీకరణ ఉండాలని, ప్రజాస్వామ్య విలువలను తగ్గించేలా ఉండకూడదని ధన్‌ఖడ్ అన్నారు. ఎవరైనా మాట్లాడేముందు ఇతరుల అభిప్రాయాలను కూడా వినేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
ధన్‌ఖడ్‌పై అవిశ్వాసం తీర్మానం నోటీసు అనాలోచిత చర్య అంటూ గత గురువారంనాడు విపక్షాల నోటీసును డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తోసిపుచ్చిన నేపథ్యంలో జైరాం రమేష్ శుక్రవారంనాడు స్పందించారు.
ధన్‌కఢ్ చర్యలు భారతదేశ ప్రతిష్టకు భంగకరంగా ఉన్నాయని, ఇది ఆయనపై వ్యక్తిగత పోరాటం ఎంతమాత్రం కాదని బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఖర్గే చెప్పారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోందంటే ఆయనే ప్రధాన కారణమని అన్నారు.
జగ్‌దీఫ్ ధన్‌ఖడ్ రాజ్యసభ చైర్మన్‌గా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ 'ఇండియా' కూటమి సోమవారంనాడు ఆయన అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది. అయితే తీర్మానం సభామోదం పొందాలంటే సభలో సాధారణ మెజారిటీ ఉండాలి.