Home » Israel
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరయుద్ధం నేపథ్యంలో చెన్నై నుంచి అరబ్ దేశాలకు వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఇరాన్ ముందు జాగ్రత్తగా తరలించినట్టు చెబుతున్న 400 కేజీల యురేనియంతో సుమారు 10 అణుబాంబులు తయారు చేయవచ్చనేది ఒక అంచనా. 'మిస్సింగ్' యురేనియం 60 శాతం ఎన్‌రిచ్ అయిందని, 90 శాతం ఎన్‌రిచ్ స్థాయికి తీసుకువెళ్తే అణ్వాయుధాలలో ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
ప్రపంచ దేశాలను ఇప్పుడు యుద్ధ భయం పట్టుకుంది. ఎప్పుడు ఎవరు ఏ దేశం మీదకు యుద్ధానికి బయలుదేరుతారో చెప్పలేని పరిస్థితి. యుద్ధాల వల్ల శాంతి కరువై, సొంతవాళ్లను పోగొట్టుకొని ఎంతో మంది రోడ్డున పడుతున్నారు.
ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు దిగింది. బేర్షివా నగరంపై జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. నివాస భవనాలు కూడా ధ్వంసం అయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన అనంతరం ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. దీంతో, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సర్దుమణిగినట్టైంది.
ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు అంగీకరించినందుకు ఇరు దేశాలకు అభినందనలు తెలిపారు.
Israel Iran War: న్యూక్లియర్ బాంబుల తయారీనే ఇరాన్ కొంపముంచింది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉండటం తమకు ప్రమాదమని ఇజ్రాయెల్ భావించింది. అణు బాంబుల తయారీని అడ్డుకోవడానికి 10 రోజుల క్రితం ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై వైమానిక దాడులు చేసింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. దాదాపు పదకొండు రోజులుగా రెండు దేశాల మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ కూడా క్షిపణి దాడులకు దిగింది.
మధ్యప్రాచ్యం నుంచి చమురు దిగుమతులు తగ్గితే భారత్ ముందు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. రష్యా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి ముడి చమురు దిగుమతులు పెంచుకునే వీలుందని అంటున్నారు.
ఇరాన్‌లోని పలు వైమానిక స్థావరాలపై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. ఈ దాడుల్లో మిసైళ్లు నిల్వ చేసిన స్థావరాలు, యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు నాశనమయ్యాయని వెల్లడించింది.